సైనికులకు రాఖీలు కట్టనున్న మహిళా మంత్రులు...సియాచిన్‌కి స్మృతి!
ఈ నెల 18న రాఖీ పండుగ సందర్భంగా మన మహిళా మంత్రులు దేశసరిహద్దుల్లో కాపాలా కాస్తున్న సైనికులకు రాఖీలు కట్టనున్నారు. అందరికంటే ప్రత్యేకంగా కేంద్ర జౌళిశాఖా మంత్రి స్మృతిఇరానీ హిమాలయ పర్వతప్రాంతంలోని అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌కి వెళ్లి సైనికులకు రాఖీ కట్టనున్నారు. ఆ రోజున సియాచిన్ వెళ్లేందుకు కేంద్ర రక్షణ శాఖ నుండి స్మృతికి అనుమతి లభించింది. సుష్మాస్వరాజ్, మేనకా గాంధీ, ఉమా భారతి…భారత సరిహద్దుల్లోని సైనికులను కలిసి రాఖీ కడతారు. నిర్మలా సీతారామన్, సాధ్వి […]
ఈ నెల 18న రాఖీ పండుగ సందర్భంగా మన మహిళా మంత్రులు దేశసరిహద్దుల్లో కాపాలా కాస్తున్న సైనికులకు రాఖీలు కట్టనున్నారు. అందరికంటే ప్రత్యేకంగా కేంద్ర జౌళిశాఖా మంత్రి స్మృతిఇరానీ హిమాలయ పర్వతప్రాంతంలోని అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌కి వెళ్లి సైనికులకు రాఖీ కట్టనున్నారు. ఆ రోజున సియాచిన్ వెళ్లేందుకు కేంద్ర రక్షణ శాఖ నుండి స్మృతికి అనుమతి లభించింది. సుష్మాస్వరాజ్, మేనకా గాంధీ, ఉమా భారతి…భారత సరిహద్దుల్లోని సైనికులను కలిసి రాఖీ కడతారు. నిర్మలా సీతారామన్, సాధ్వి నిరంజన్ జ్యోతి, అనుప్రియా పటేల్ సైతం జవాన్లను కలుస్తారు.
సియాచిన్ యుద్ధభూమిలోని సైనికులను ప్రధాని, రక్షణశాఖా మంత్రులు ప్రత్యేక సందర్భాల్లో కలుస్తుంటారు. అయితే స్మృతి ఇరానీ ఈ నిర్ణయం తీసుకోవటంతో తొలిసారి సియాచిన్‌కి వెళుతున్న మహిళా మంత్రి ఆమే కావచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాన్స్ నాయక్ హనుమంతప్ప, మరో తొమ్మిది మంది సైనికులు వీరమరణం పొందినప్పుడు ఈ యుద్ధభూమి ప్రత్యేకతపై మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో ప్రధాని నరేంద్రమోడీ దీపావళి సందర్భంగా సియాచిన్‌కి వెళ్లి సైనికులను కలిశారు.