తన అఙ్ఞానం బయటపెట్టుకున్న సూపర్‌స్టార్
ఒకోసారి మాట్లాడడం కోసమే మాట్లాడుతున్నట్లు ఉంటుంది… బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ని చూస్తే. కొన్ని సార్లు కాంట్రవర్సీ సృష్టించడానికే మాట్లాడతాడా? ఇప్పుడొక కొత్త తంటా తెచ్చుకున్నాడు. మనోడు రియో ఒలింపిక్స్ కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా మన దేశం తరఫున నియమించబడ్డాడు కదా! దీపా కార్మాకర్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున ఫైనల్స్‌కి క్వాలిఫై అయిన మొదటి క్రీడాకారిణి. ఆమె గురించి సల్మాన్‌ని అడిగితే ముందు ‘దీపిక’ అని మొదలెట్టాడు. ఎవరో తప్పు సరిదిద్దితే ‘దీప్తి’ అని ఇంకొక […]
ఒకోసారి మాట్లాడడం కోసమే మాట్లాడుతున్నట్లు ఉంటుంది… బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ని చూస్తే. కొన్ని సార్లు కాంట్రవర్సీ సృష్టించడానికే మాట్లాడతాడా? ఇప్పుడొక కొత్త తంటా తెచ్చుకున్నాడు. మనోడు రియో ఒలింపిక్స్ కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా మన దేశం తరఫున నియమించబడ్డాడు కదా! దీపా కార్మాకర్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున ఫైనల్స్‌కి క్వాలిఫై అయిన మొదటి క్రీడాకారిణి. ఆమె గురించి సల్మాన్‌ని అడిగితే ముందు ‘దీపిక’ అని మొదలెట్టాడు. ఎవరో తప్పు సరిదిద్దితే ‘దీప్తి’ అని ఇంకొక తప్పు పేరు చెప్పాడు. తానే గుడ్‌విల్ అంబాసిడర్ అయ్యి ఉండీ… మన దేశం తరఫున ఘనత సాధిస్తున్న క్రీడాకారిణి పేరు కూడా గుర్తుండకపోవడం తన అఙ్ఞానాన్ని బయటపెట్టుకోడమే. సల్మాన్ నియామకాన్ని చాలా మంది వ్యతిరేకించినప్పుడు చాలా ఎగిరెగిరి పడ్డాడు. సచిన్ నియామకాన్ని ప్రశ్నించాడు. ఇప్పుడు కనీసం పేరు గుర్తులేకపోవడాన్ని ఏమనాలి?