నయీంకు మద్దతిచ్చిన 14 మంది ఐపీఎస్‌ల గుండెల్లో రైళ్లు!
ఓ గ్యాంగ్ స్టర్ నయీం కు ఇంతమంది ఐపీఎస్ అధికారులతో సాన్నిహిత్యమా? అంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! నయీం హతమైన తరువాత ఈకేసును సిట్ బృందం పర్యవేక్షిస్తోంది. నయీంకు సహకరించిన వారందరి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో నయీంకు 14 మంది ఐపీఎస్‌లతో స్నేహముంది అని తెలుసుకుని పోలీసులు నివ్వెరపోతున్నారు. నయీం తన డైరీలో ఈ విషయాలన్నీ రాసుకోవడం, అది ఇప్పుడు బయటపడటంతో ఆ అధికారుల జాబితా త్వరలోనే వెల్లడవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈకేసులో ఎవరినీ […]
BY sarvi11 Aug 2016 5:06 AM IST
X
sarvi Updated On: 11 Aug 2016 5:29 AM IST
ఓ గ్యాంగ్ స్టర్ నయీం కు ఇంతమంది ఐపీఎస్ అధికారులతో సాన్నిహిత్యమా? అంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! నయీం హతమైన తరువాత ఈకేసును సిట్ బృందం పర్యవేక్షిస్తోంది. నయీంకు సహకరించిన వారందరి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో నయీంకు 14 మంది ఐపీఎస్‌లతో స్నేహముంది అని తెలుసుకుని పోలీసులు నివ్వెరపోతున్నారు. నయీం తన డైరీలో ఈ విషయాలన్నీ రాసుకోవడం, అది ఇప్పుడు బయటపడటంతో ఆ అధికారుల జాబితా త్వరలోనే వెల్లడవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈకేసులో ఎవరినీ వదలవద్దని ప్రభుత్వం స్పష్టం చేయడంతో గతంలో నయీంకు సహకరించిన ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్ల పరిగెడుతున్నాయి. నయీంకు గతంలో సహకరించిన ఐపీఎస్‌లు అతన్ని కేవలం నక్సలైట్లను మట్టుబెట్టడానికే కాకుండా తమ సొంత వ్యాపారాలకు ఎక్కువగా వాడుకున్నారని తెలిసింది.
భూములు లాక్కోవడం, అడ్డొచ్చిన వారిని నయీంతో లేపేయించిన ఐపీఎస్ అధికారులు ఇందుకోసం నయీంను ఆయుధంగా వాడుకున్నారు. భారీగా బంధువల పేర్లతో రాజధాని శివార్లలో కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు. అందుకే, నయీం మీద చర్యలకు ఉపక్రమించిన పోలీసులందరికీ ఉన్నతాధికారుల నుంచి ఫోన్ వచ్చేది. నయీం జోలికి వెళ్లడం మానుకో! అని హెచ్చరించేవారు. రాజధాని, పరిసర జిల్లాలో ఏ హత్య జరిగినా.. చేయించింది నయీమా? కాదా? అని కనుక్కుని ప్రొసీడ్ అయ్యేవారు పోలీసులు. నల్లగొండలో ఓ ఐపీఎస్ అధికారి నయీం ఆగడాలకు అడ్డుకట్ట వేద్దామనుకున్నాడు. విషయం తెలుసుకున్న నయీం ముఠా అతన్ని ఏకంగా వేరే జిల్లాకు బదిలీ చేయించింది. మరో పోలీసు ఉన్నతాధికారికి ఓ మంత్రి ఫోన్ చేసి నయీం గురించి ఆలోచించకు అని చెప్పాడంటే అతని పరిచయాలు ఏ స్థాయిలో ఉండేవో అర్థమవుతోంది. ఐపీఎస్ అధికారి అయితేనే నయీం మాట్లాడేవాడు. సాధారణ పోలీసులతో అస్సలు సంబంధాలు పెట్టుకునేవాడు కాదు.
Next Story