సీఎంను కలుస్తానన్న దినేష్ రెడ్డి... అనవసరంగా గెలుక్కున్నారా?
గ్యాంగ్‌స్టర్ నయీంతో మాజీ డిజీపీకి సంబంధాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ప్రైవేట్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన… నయీం ఎన్‌కౌంటర్ మంచిదేనన్నారు. ఈ విషయంలో పోలీసులకు స్వేచ్చనిచ్చిన సీఎం కేసీఆర్‌కు తాను సలాం చేస్తున్నానని దినేష్ రెడ్డి చెప్పారు. నయీంతో తనకు గానీ మరే మాజీ డిజీపీకి గాని ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. అసలు డీజీపీ స్థాయి వ్యక్తికి అలాంటి సంబంధాలు పెట్టుకునే […]
గ్యాంగ్‌స్టర్ నయీంతో మాజీ డిజీపీకి సంబంధాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ప్రైవేట్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన… నయీం ఎన్‌కౌంటర్ మంచిదేనన్నారు. ఈ విషయంలో పోలీసులకు స్వేచ్చనిచ్చిన సీఎం కేసీఆర్‌కు తాను సలాం చేస్తున్నానని దినేష్ రెడ్డి చెప్పారు. నయీంతో తనకు గానీ మరే మాజీ డిజీపీకి గాని ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. అసలు డీజీపీ స్థాయి వ్యక్తికి అలాంటి సంబంధాలు పెట్టుకునే అవకాశం కూడా ఉండదన్నారు. లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా పోలీసులు వాడుకోవడం ఎప్పటినుంచో ఉందని, ఈ విషయంలో డీజీపీ స్థాయి వ్యక్తులు జ్యోక్యం చేసుకోరని, వాళ్లను కలుసుకోరని , ఈ వ్యవహారాలు కిందిస్థాయి అధికారులు చూసుకుంటారని ఆయన అన్నారు.
సంచలనం కోసమే ఒక టీవీ ఛానల్ ఇలాంటి ప్రచారం చేసిందన్నారు. గతంలో తాను డీజీపీ కాకముందు కూడా ఇలాగే సదరు ఛానల్ తప్పుడు ప్రచారం చేసిందని… తాను డీజీపీ అవగానే పొగుడుతూ కథనాలు రాసిందని గుర్తు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ అంటే అత్యున్నత స్థాయి అధికారి అని, ఇన్ఫార్మర్లను వాళ్లు డీల్ చేయరని చెప్పారు. మహా అయితే డీఐజీ స్థాయి అధికారి మాత్రమే ఇన్ఫార్మర్లను వాడుకుంటారన్నారు.
ఈ ఛానల్ నిర్వాహకుడు కోఆపరేటివ్ సొసైటీ భూ కుంభకోణంలో ఇరుక్కుని ఆ తరువాత రక్షించమని నా కాళ్లు పట్టుకున్నాడని దినేష్ రెడ్డి మండిపడ్డారు. ఆ ఛానల్ నిర్వాహకుడు ఎన్టీవీ చౌదరి అని అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు.
తాను డీజీపీగా ఉండగా నయీంను అరెస్టు చేయడానికి అనుమతికోసం ప్రభుత్వాన్నికోరానని కానీ అనుమతి లభించలేదని దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తానని … ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన సున్నిత విషయాలను ఆయనకే వివరిస్తానన్నారు. నయీం సాయంతో ఆస్తులు సంపాదించుకున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ సరిగా లేకుంటే బీజేపీ తరపున మరో ఏజెన్సీతో దర్యాప్తుకు డిమాండ్ చేస్తామన్నారు. ఈ కేసులో ఉన్నవారందరినీ బయటకు తేవాలని దినేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను పార్టీ ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. కేఎస్ వ్యాస్ హత్య జరిగినప్పుడు తాను పక్కనే ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేశారని దినేష్ రెడ్డి చెప్పారు. హత్య జరిగిన రోజు తాను స్డేడియంలో ఉన్న మాట వాస్తవమేనని… కానీ వ్యాస్‌కు తనకు మధ్య నాలుగు వందల గజాల దూరం ఉందన్నారు. అయితే తన పేరు నేరుగా ఎక్కడా రాకపోయినా దినేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా తనకు తానే ఇంకా ప్రచారంచేసుకున్నట్టుగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితిలో నిజాయితీగా వివరణ ఇచ్చుకునేందుకు ప్రెస్ మీట్ పెట్టినా… కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
Click on Image to Read: