నయీం పాపాల్లో జర్నలిస్టుల వాటా!
గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన తరువాత అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అతనికి పోలీసులు- రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే! వీళ్లతోపాటు నయీం అనుచరుల్లో జర్నలిస్టులు కూడా ఉన్నారని, వారు నయూం స్నేహం వల్ల రూ.35 కోట్ల ఆస్తులు సంపాదించారన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. తాను చేసే అక్రమాలకు పోలీసులను, రాజకీయ నాయకులను విరివిగా వాడుకున్న నయీం.. జర్నలిస్టులతోనూ సంబంధాలు నెరిపాడన్న విషయం తాజాగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. భువనగిరి, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో […]
BY sarvi10 Aug 2016 6:13 AM IST
X
sarvi Updated On: 10 Aug 2016 8:27 AM IST
గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన తరువాత అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అతనికి పోలీసులు- రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే! వీళ్లతోపాటు నయీం అనుచరుల్లో జర్నలిస్టులు కూడా ఉన్నారని, వారు నయూం స్నేహం వల్ల రూ.35 కోట్ల ఆస్తులు సంపాదించారన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. తాను చేసే అక్రమాలకు పోలీసులను, రాజకీయ నాయకులను విరివిగా వాడుకున్న నయీం.. జర్నలిస్టులతోనూ సంబంధాలు నెరిపాడన్న విషయం తాజాగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. భువనగిరి, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూమిని నయీం కబ్జా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాలను బయటకి పొక్కకుండా పోలీసులను రాజకీయ నాయకులను సులువుగానే మేనేజ్ చేసిన నయీం.. స్థానికంగా ఉండే జర్నలిస్టులను తన వైపునకు తిప్పుకోవడంలో కూడా సఫలీకృతమయ్యాడు. అందుకే, వందల ఎకరాలు కబ్జా చేసినా.. బెదిరింపులు, సెటిల్‌మెంట్లకు పాల్పడినా మీడియాలో చిన్న వార్త అయినా రాలేదంటే కారణం ఇదేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
నయీంతో సంబంధాలు ఉన్నట్లుగా భావిస్తున్న ముగ్గురు వేర్వేరు సంస్థల్లో పనిచేసే మీడియా ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. నయీం సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలలో పాలు పంచుకున్న వీరు కూడా బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. నెలకు ఐదారు వేలకంటే ఎక్కువ సంపాదించేందుకు వీలులేని వీరి ముగ్గురి ఆస్తి రూ.35 కోట్లు దాటిందంటే నయీం వల్ల వీరు ఎంతలా సంపాదించారన్నవిషయం అర్థమవుతోంది. తాను చేసే అక్రమాలను లోకానికి తెలియనివ్వకుండా మీడియాను కూడా నయీం మీడియాను మేనేజ్ చేశాడన్న మాట!
Next Story