ఎన్నాళ్లీ మోసాలు? ... ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు
కొత్తగా పెళ్లిచేసుకుంటున్న అబ్బాయిలు కొందరు తమకున్న జబ్బులను దాచిపెట్టి పెళ్లి కుమార్తెలను మోసం చేస్తున్నారని ఇలాంటి నేరాలను అదుపుచేయాలంటే పెళ్లికి ముందే వధూవరులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వాళ్లు ఆరోగ్యవంతులని తేలాకే పెళ్లిళ్లకు అనుమతినిచ్చేలా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని చెన్నై హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ ఒక కేసు విచారణ సందర్భంగా తీర్పునిచ్చారు. చెన్నైకి చెందిన ఒక యువతి ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది. తన భర్తకు పెళ్లికిముందే బ్లడ్ క్యాన్సర్ ఉందని, ఆ […]
కొత్తగా పెళ్లిచేసుకుంటున్న అబ్బాయిలు కొందరు తమకున్న జబ్బులను దాచిపెట్టి పెళ్లి కుమార్తెలను మోసం చేస్తున్నారని ఇలాంటి నేరాలను అదుపుచేయాలంటే పెళ్లికి ముందే వధూవరులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వాళ్లు ఆరోగ్యవంతులని తేలాకే పెళ్లిళ్లకు అనుమతినిచ్చేలా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని చెన్నై హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ ఒక కేసు విచారణ సందర్భంగా తీర్పునిచ్చారు.
చెన్నైకి చెందిన ఒక యువతి ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది. తన భర్తకు పెళ్లికిముందే బ్లడ్ క్యాన్సర్ ఉందని, ఆ విషయం దాచిపెట్టి, తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని, తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. అందుకు భర్త నిరాకరించాడు. కేసు హైకోర్టుకు మారింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆమెకు వెంటనే విడాకులు మంజూరుచేయడమే కాకుండా భవిష్యత్తులో ఏ మహిళా ఇలాంటి మోసాలకు గురికాకుండా పెళ్లి కాబోయే యువతీయువకులకు ముందుగా వైద్యపరీక్షలు నిర్వహించేలా కేంద్రరాష్ట్రప్రభుత్వాలు చట్టాలు చేయాలని తీర్పునిచ్చారు.
ఈ అమ్మాయి విషయంలో వరుడికి అరుదైన బ్లడ్ క్యాన్సర్ ఉంది కానీ చాలా మంది యువకులకు లైంగిక సంబంధ వ్యాధులు ఉన్నా ముఖ్యంగా హెచ్‌ఐవి పాజిటివ్ అని తెలిసి కూడా అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు సంసార జీవితానికి పనికిరాకున్నా సమాజంకోసం పెళ్లిచేసుకుని భార్యల జీవితాలను నాశనంచేస్తున్నారు.
న్యాయమూర్తి కృపాకరన్ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లుగా పెళ్లికి ముందే వైద్య పరీక్షల చట్టం అమలులోకి వస్తే అనేకమంది అమాయక మహిళలు బలిపశువులు కాకుండా తప్పించుకోగలుగుతారు.
Click on Image to Read: