మరో విషయంలో తొలి స్థానం సాధించిన చంద్రబాబు
చంద్రబాబు ఏటా తన ఆస్తులు ప్రకటిస్తుంటారు. తాను దేశంలోనే చాలా బీద పొలిటిషియన్ అన్నట్టుగా ఆ లెక్కల్లో గారడీ చేస్తుంటారు చంద్రబాబు. అయితే ఇటీవల దేశంలోని మంత్రులు ఆస్తుల వివరాలు బయటపెట్టిన అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) మాత్రం చంద్రబాబే దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా తేల్చింది. తాజా రిపోర్టు ప్రకారం చంద్రబాబు రూ. 134 కోట్ల చరాస్తులు, 43 కోట్ల స్థిరాస్తులతో దేశంలోనే ధనికుడైన సీఎంగా తొలిస్థానాన్ని సొంతం చేసుకున్నారు. రూ. 129కోట్లతో రెండో స్థానంలో […]
చంద్రబాబు ఏటా తన ఆస్తులు ప్రకటిస్తుంటారు. తాను దేశంలోనే చాలా బీద పొలిటిషియన్ అన్నట్టుగా ఆ లెక్కల్లో గారడీ చేస్తుంటారు చంద్రబాబు. అయితే ఇటీవల దేశంలోని మంత్రులు ఆస్తుల వివరాలు బయటపెట్టిన అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) మాత్రం చంద్రబాబే దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా తేల్చింది. తాజా రిపోర్టు ప్రకారం చంద్రబాబు రూ. 134 కోట్ల చరాస్తులు, 43 కోట్ల స్థిరాస్తులతో దేశంలోనే ధనికుడైన సీఎంగా తొలిస్థానాన్ని సొంతం చేసుకున్నారు. రూ. 129కోట్లతో రెండో స్థానంలో అరుణాచల్ సీఎం పెమాఖండు నిలిచారు. 113 కోట్లతో తమిళనాడు సీఎం జయలలిత మూడో స్తానంలో ఉన్నారు.
తాజా రిపోర్టు ద్వారా చంద్రబాబు బండారం మరోసారి బట్టబయలైంది. చంద్రబాబు గత సెప్టెంబర్ నెలలో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆ వివరాల్లో చంద్రబాబు ఆస్తుల విలువ కేవలం రూ. 42 లక్షలు మాత్రమే. తాజాగా చంద్రబాబు సమర్పించిన అఫిడవిట్ లెక్కల ఆధారంగా ఏడీఆర్ సంస్థ చంద్రబాబు ఆస్తుల విలువ ఏకంగా రూ. 177 కోట్ల రూపాయలుగా తేల్చింది. అది కూడా ఆయన సమర్పించిన అఫిడవిట్ వివరాల ప్రకారం విలువే ఇంత ఉంది. ఇక బాబుగారి అసలు ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లు దాటిందో!. మొత్తానికి ఏపీని వరుసగా పలు విషయాల్లో చంద్రబాబు ఆగ్రస్థానంలో నిలుపుతున్నారు. ఏపీ అవినీతిలోనే నెంబర్‌గా ఉందని కేంద్ర నివేదికే తేల్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రుల ఆస్తుల వివరాలును ఏడీఆర్ ప్రకటించగా… అందులో నెంబర్ వన్ స్థానాన్ని మంత్రి నారాయణ దక్కించుకున్నారు. తాజాగా చంద్రబాబు కూడా నెంబర్ వన్ అయ్యారు.
Click on Image to Read: