ఒకవైపు నిర్మాణం... మరోవైపు కూల్చివేతలు...
నూతన సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము అని మీడియా మైకుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి అనుచర గణం రోజూ బల్లగుద్ది చెబుతారు. ఇంత తక్కువ సమయంలో ఎవరూ నిర్మించని విధంగా మేము సచివాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పిన ఆ అనుచర గణమే ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయంలోకి అడుగుపెట్టడానికి ససేమిరా అంటున్నారు. ఒకప్పుడు చెట్లకింద ఉండైనా పనిచేస్తాం అని చెప్పిన వాళ్లు కూడా నూతన సచివాలయంలో అడుగుపెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. సచివాలయ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలగురించి ప్రతిపక్షాలు, మేధావులు […]
నూతన సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము అని మీడియా మైకుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి అనుచర గణం రోజూ బల్లగుద్ది చెబుతారు. ఇంత తక్కువ సమయంలో ఎవరూ నిర్మించని విధంగా మేము సచివాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పిన ఆ అనుచర గణమే ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయంలోకి అడుగుపెట్టడానికి ససేమిరా అంటున్నారు. ఒకప్పుడు చెట్లకింద ఉండైనా పనిచేస్తాం అని చెప్పిన వాళ్లు కూడా నూతన సచివాలయంలో అడుగుపెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. సచివాలయ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలగురించి ప్రతిపక్షాలు, మేధావులు మాట్లాడితే కావాలానే రాజధాని పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కానీ అక్కడి వాస్తవిక పరిస్థితులను చూస్తే తెలుస్తుంది. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఒక అధికారి టాయిలెట్ కోసం ఏకంగా వెలగపూడి నుంచి కారులో విజయవాడకు వెళ్లడం అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అద్దం పడుతుంది.
సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లు చిన్నవిగా, చాలా ఇరుగ్గా ఉన్నాయని, అందులో పనిచేయలేమని మున్సిపల్ మంత్రి నారాయణకు మంత్రులు తెగేసిచెప్పారు. ఆర్ధిక మంత్రి యనమల చాంబర్ మాత్రమే విశాలంగా వుండి తమకు కేటాయించిన చాంబర్లు చిన్నగా, ఇరుగ్గా ఉండడం చూసి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా, ప్రత్తిపాటి, కొల్లు రవీంద్ర మరికొందరు మంత్రులు మండిపడ్డారట.
దీంతో స్పందించిన మంత్రి
ప్రస్తుతం ఉన్న చాంబర్‌లను కూల్చేసి పెద్దవిగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఒక్కో భవనంలో ప్రస్తుతం ఐదు చాంబర్‌లుగా ఉన్న గదులను మూడు చాంబర్లుగా మార్చాలని నిర్ణయించారు. ఇలా మార్చడానికి కనీసం రెండు నుంచి మూడు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు.
అయితే సచివాలయంలో ప్రవేశానికి ప్రభుత్వం బుధవారాన్ని చివరి ముహూర్తంగా నిర్ణయిండంతో అక్కడికి వెళ్తున్న వివిధ శాఖల ఉద్యోగులంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్తున్నామే కాని అక్కడ పనిచేయడానికా పాడా, కొబ్బరికాయ కొట్టేసి తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాము అంటూ సెటైర్లు వేసుకుంటున్నారట…!
Click on Image to Read: