తెలుగు ప్రాచీన హోదాకు తెలంగాణ చేయూత
ప్రాచీన హోదా కల్పించడానికి తెలుగు భాష అనర్హమంటూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవతో ఈ కేసు వీగిపోయింది. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడం నిబంధనలకు విరుద్ధమంటూ తమిళనాడుకు చెందిన ఆర్. గాంధీ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దేశంలో ఏదైనా భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటే.. కనీసం 1500 నుంచి 2000 ఏళ్ల చరిత్ర ఉండాలి. అందుకు అనుగుణంగా సాహిత్య ఆధారాలు ఉండాలి. తెలుగు […]
BY sarvi9 Aug 2016 5:30 AM IST
X
sarvi Updated On: 9 Aug 2016 5:50 AM IST
ప్రాచీన హోదా కల్పించడానికి తెలుగు భాష అనర్హమంటూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవతో ఈ కేసు వీగిపోయింది. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడం నిబంధనలకు విరుద్ధమంటూ తమిళనాడుకు చెందిన ఆర్. గాంధీ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దేశంలో ఏదైనా భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటే.. కనీసం 1500 నుంచి 2000 ఏళ్ల చరిత్ర ఉండాలి. అందుకు అనుగుణంగా సాహిత్య ఆధారాలు ఉండాలి. తెలుగు భాషకు నన్నయను ఆదికవిగా చెప్పడంతో ఆర్. గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నన్నయ 11 శతాబ్దానికి చెందిన కవి అయినపుడు తెలుగు భాషకు కనీస అర్హత అయిన 1500 ఏళ్ల చరిత్ర లేనట్లేనని ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలుగుభాషకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉందని నిరూపించే ఆధారాలను వెతికే పనిలో పడింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన పంప మహాకవి రాసిన విక్రమార్కుని విజయం, ఆదిపురాణం గ్రంథాలకు సంబంధించిన ఆధారాలను మద్రాస్ హైకోర్టుకు సమర్పించింది. వీటిని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు గాంధీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో తెలుగు భాషకు ప్రాచీన హోదాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
Next Story