ఈసారి కూడా సంక్రాంతికి శర్వానంద్ సినిమా
హీరో శర్వానంద్ మరోసారి సంక్రాంతిని టార్గెట్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజాను విడుదల చేశాడు శర్వానంద్. ఓవైపు బాలయ్య, మరోవైపు నాగార్జున… మధ్యలో ఎన్టీఆర్ లాంటి హీరోలతో పోటీ ఉన్నప్పటికీ… ఏమాత్రం భయపడకుండా తన సినిమాను విడుదల చేశాడు. శర్వానంద్ నిబ్బరం పనిచేసింది. రెవెన్యూ పర్సంటేజీ రేషియో పరంగా బాలయ్య, నాగ్, తారక్ సినిమాల కంటే శర్వానంద్ సినిమాకే ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో వచ్చే ఏడాాది సంక్రాంతికి కూడా మరో […]
BY sarvi9 Aug 2016 7:15 AM IST

X
sarvi Updated On: 9 Aug 2016 12:03 PM IST
హీరో శర్వానంద్ మరోసారి సంక్రాంతిని టార్గెట్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజాను విడుదల చేశాడు శర్వానంద్. ఓవైపు బాలయ్య, మరోవైపు నాగార్జున… మధ్యలో ఎన్టీఆర్ లాంటి హీరోలతో పోటీ ఉన్నప్పటికీ… ఏమాత్రం భయపడకుండా తన సినిమాను విడుదల చేశాడు. శర్వానంద్ నిబ్బరం పనిచేసింది. రెవెన్యూ పర్సంటేజీ రేషియో పరంగా బాలయ్య, నాగ్, తారక్ సినిమాల కంటే శర్వానంద్ సినిమాకే ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో వచ్చే ఏడాాది సంక్రాంతికి కూడా మరో సినిమా రెడీ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ చేస్తున్న సినిమా శతమానంభవతి. అ..ఆ ఫేం అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. సంక్రాంతికి సినిమాను దింపుతామని మోషన్ పోస్టర్ లోనే క్లియర్ చేశారు. సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా హిట్ అయితే… శర్వానంద్ సంక్రాంతి హీరోగా మారిపోవడం ఖాయం.

Next Story