మాజీ సీఎం ఆత్మహత్య
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కలిఖో ప్రాణాలు తీసుకున్నారని చెబుతున్నారు. కలిఖో గత నెలలోనే సీఎం పదవి నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ తిరుగుబాటు నేతగా ఈయన ముఖ్యమంత్రి పదవిని ఫిబ్రవరిలో చేపట్టారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, కేంద్రం సాయంతో 145 రోజుల పాటు సీఎంగా పాలన సాగించారు. అయితే కలిఖోను సీఎం కూర్చీపై కూర్చొబెట్టిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. […]
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కలిఖో ప్రాణాలు తీసుకున్నారని చెబుతున్నారు. కలిఖో గత నెలలోనే సీఎం పదవి నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ తిరుగుబాటు నేతగా ఈయన ముఖ్యమంత్రి పదవిని ఫిబ్రవరిలో చేపట్టారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, కేంద్రం సాయంతో 145 రోజుల పాటు సీఎంగా పాలన సాగించారు. అయితే కలిఖోను సీఎం కూర్చీపై కూర్చొబెట్టిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో కలిఖో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కలిఖో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని చెబుతున్నారు. ఈ పరిణామాలే ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చని భావిస్తున్నారు.