నిలువు దోపిడి " చంద్రన్న హోటల్ మేనేజ్‌మెంట్
పుష్కరాలకు వచ్చే భక్తులను దోచుకునేందుకు దొంగలు, ప్రైవేట్ వ్యక్తులు మాటు వేయడం మాత్రమే ఇప్పటి వరకు విన్నాం. ఇప్పుడు భక్తుల దోపిడికి ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తుల నుంచి వీలైనంత ఎక్కువ సొమ్ము రాబట్టుకోవడం ఎలాగో సూచనలు కూడా చేస్తోంది. ఈనెల 12 నుంచి కృష్ణ పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విజయవాడ, గుంటూరు పరిధిలోని హోటల్ యాజమాన్యాలతో ప్రభుత్వమే ఒక అవగాహనకు వచ్చింది. ప్రతి హోటల్‌లో 30 శాతం గదులు ఉచితంగా ప్రభుత్యానికి అప్పగించాలని హోటల్ […]
పుష్కరాలకు వచ్చే భక్తులను దోచుకునేందుకు దొంగలు, ప్రైవేట్ వ్యక్తులు మాటు వేయడం మాత్రమే ఇప్పటి వరకు విన్నాం. ఇప్పుడు భక్తుల దోపిడికి ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తుల నుంచి వీలైనంత ఎక్కువ సొమ్ము రాబట్టుకోవడం ఎలాగో సూచనలు కూడా చేస్తోంది. ఈనెల 12 నుంచి కృష్ణ పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విజయవాడ, గుంటూరు పరిధిలోని హోటల్ యాజమాన్యాలతో ప్రభుత్వమే ఒక అవగాహనకు వచ్చింది. ప్రతి హోటల్‌లో 30 శాతం గదులు ఉచితంగా ప్రభుత్యానికి అప్పగించాలని హోటల్ యాజమాన్యాలకు సబ్ కలెక్టరే నేరుగా లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా ఇస్తే తమకేంటని హోటల్ యాజమాన్యాల ప్రశ్నకు ప్రభుత్వం మీరు దోచుకోండి మేం పట్టించుకోం అన్నట్టుగా మౌలిక జవాబులిచ్చింది.
హోటల్ గదులు అద్దెలు రెట్టింపు చేయాల్సిందిగా సూచనలు చేశారు. అంతే కాదు ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిని వన్ డేగా చూసేవారు. కానీ పుష్కరాల సమయంలో 12 గంటల టారిఫ్ అమలుకు ప్రభుత్వం ఓకే చేసింది. అంటే ఏ సమయంలో దిగినా 12 గంటల తరువాత గదులు ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో మరో రోజు అద్దెను చదివించుకోవాల్సి ఉంటుంది. రాత్రి 9గంటలకు హోటల్‌లో దిగితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఖాళీ చేయాల్సిందేనన్నమాట. ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారి కోసం ఉచితంగా గదులను కొట్టేసేందుకు ఇలాంటి ఎత్తుగడ వేశారని చెబుతున్నారు. అయిన వారికి ఉచిత సేవలు అందించేందుకు గానూ ఆ భారాన్ని సామాన్య జనంపై బాదేయాలని నిర్ణయించారు. పైకి మాత్రం ప్రభుత్వ సిబ్బంది కోసమే 30శాతం గదులను తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు.
Click on Image to Read: