ప్లీజ్...పోకెమాన్ కోసం పోలింగ్ కేంద్రాలకు రాకండి!
థాయ్‌లాండ్‌లో ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బందోబస్తు చర్యలతో పాటు అధికారులు ప్రజలకు మరొక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. దయచేసి పోకెమాన్ గో ఆడుతూ పోలింగ్ కేంద్రాల్లోకి రాకండి…అని చెబుతున్నారు. ఇక్కడ పోకెమాన్ గేమ్‌ని నిన్ననే మార్కెట్‌లోకి విడుదల చేశారు. దాంతో జనం పోకెమాన్ ఆడుతూ పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చేస్తారని అధికారులు భయపడుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు దరిదాపుల్లో ఈ ఆటని ఆడటానికి వీలు లేదని, పోకెమాన్‌ని పట్టుకోవడానికి ఎన్నికల కేంద్రాల్లోకి వచ్చేస్తే అది చట్టవిరుద్దమైన చర్య అవుతుందని […]
థాయ్‌లాండ్‌లో ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బందోబస్తు చర్యలతో పాటు అధికారులు ప్రజలకు మరొక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. దయచేసి పోకెమాన్ గో ఆడుతూ పోలింగ్ కేంద్రాల్లోకి రాకండి…అని చెబుతున్నారు. ఇక్కడ పోకెమాన్ గేమ్‌ని నిన్ననే మార్కెట్‌లోకి విడుదల చేశారు. దాంతో జనం పోకెమాన్ ఆడుతూ పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చేస్తారని అధికారులు భయపడుతున్నారు.
పోలింగ్ కేంద్రాలకు దరిదాపుల్లో ఈ ఆటని ఆడటానికి వీలు లేదని, పోకెమాన్‌ని పట్టుకోవడానికి ఎన్నికల కేంద్రాల్లోకి వచ్చేస్తే అది చట్టవిరుద్దమైన చర్య అవుతుందని ఎన్నికల కమిషన్ సభ్యుడొకరు హెచ్చరించారు. అలాగే ఓటువేస్తూ సెల్ఫీలు తీసుకోవడం కూడా నేరమేనని ఆ సభ్యుడు పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌లో నూతన రాజ్యాంగంపై ప్రజాభిప్రాయ సేకరణకోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.