కశ్మీర్‌లోయలో గాయపడిన వారికి చికిత్స అందిస్తాం...పాకిస్తాన్!
కశ్మీర్‌లోయలో జరుగుతున్న ఆందోళనల్లో గాయపడిన వారికి చికిత్సని అందించడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం ఈ ప్రకటన చేశారు. దీనిపై అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని, భారత్ ఇందుకు సమ్మతించేలా చేయాలని కూడా కోరారు. పాక్ పత్రిక డాన్ ఆన్‌లైన్‌లో ఈ వార్తని ప్రచురించింది. కశ్మీర్‌లో హిజ్బుల్ మిలిటెంట్ బర్హన్ వానీ మరణం తరువాత అలజడి కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన తరువాత కనీసం 55 మంది […]
కశ్మీర్‌లోయలో జరుగుతున్న ఆందోళనల్లో గాయపడిన వారికి చికిత్సని అందించడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం ఈ ప్రకటన చేశారు. దీనిపై అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని, భారత్ ఇందుకు సమ్మతించేలా చేయాలని కూడా కోరారు. పాక్ పత్రిక డాన్ ఆన్‌లైన్‌లో ఈ వార్తని ప్రచురించింది. కశ్మీర్‌లో హిజ్బుల్ మిలిటెంట్ బర్హన్ వానీ మరణం తరువాత అలజడి కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన తరువాత కనీసం 55 మంది మరణించి ఉంటారని, వందల మంది గాయపడి చికిత్సపొందుతున్నారని తెలుస్తోంది.
ఏడవ సార్క్ దేశాల హోం మంత్రుల సదస్సులో భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, పాక్ హోం మంత్రి చౌధరి నిసార్ అలీ ఖాన్ ల మధ్య ఉగ్రవాదం పై మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఈ ప్రకటన చేయటం గమనించదగిన విషయం. గాయపడిన వారికి తాము వైద్యసదుపాయాలు కల్పించాలనుకుంటున్నామని, ముఖ్యంగా పిల్లెట్స్ గాయాలకు గురయిన వారికి వైద్యం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కశ్మీరీలకోసం ప్రపంచంలోనే అత్యుత్తమమైన వైద్యసదుపాయాలను సమకూర్చగలమన్నారు. బాధితులకు వైద్యంతో పాటు వసతి సదుపాయాలు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ…. అంతర్జాతీయ సమాజాలు, మానవతా సంస్థలు, ప్రజా సంఘాల మద్దతు పొంది కశ్మీర్ బాధితులకు పాక్ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని నవాజ్ షరీఫ్ కోరారు.