వెంటిలేటర్లు ఖాళీలేవు... ఆక్సిజన్‌కోసం బెలూన్ని నొక్కుతూనే ఉన్నాడు!
ఆసుపత్రిలో ప్రాణాపాయంలో ఉన్న తన చెల్లెలి భర్తకి ఆక్సిజన్ని అందించడానికి ఓ వ్యక్తి నాలుగుగంటలపాటు నిరంతరాయంగా చేత్తో బెలూన్ని నొక్కుతూనే ఉన్నాడు. ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలోని పరిస్థితి ఇది. మహారాష్ట్రలోని సతారాకి చెందిన ప్రమోద్ ధనావాడే ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను గత మంగళవారం తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు. మంచంపై నుండి లేస్తూ పడిపోయాడు. తలకు దెబ్బ తగలడంలో తలలో రక్త స్రావమై స్పృహ తప్పాడు. అతడిని వెంటనే అంథేరి ఈస్ట్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి […]
ఆసుపత్రిలో ప్రాణాపాయంలో ఉన్న తన చెల్లెలి భర్తకి ఆక్సిజన్ని అందించడానికి ఓ వ్యక్తి నాలుగుగంటలపాటు నిరంతరాయంగా చేత్తో బెలూన్ని నొక్కుతూనే ఉన్నాడు. ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలోని పరిస్థితి ఇది. మహారాష్ట్రలోని సతారాకి చెందిన ప్రమోద్ ధనావాడే ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను గత మంగళవారం తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు. మంచంపై నుండి లేస్తూ పడిపోయాడు. తలకు దెబ్బ తగలడంలో తలలో రక్త స్రావమై స్పృహ తప్పాడు. అతడిని వెంటనే అంథేరి ఈస్ట్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో శనివారం ముంబయి పారెల్లో ఉన్న కెఇఎమ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ప్రమోద్ తో పాటు ఉన్న అతని బావ సంతోష్ రంజనేతో డాక్టర్లు… ఆసుపత్రిలో ఎమర్జన్సీ వార్డులో వెంటిలేటర్లు ఖాళీగా లేవని చేత్తో బెలూన్ని నొక్కటం ద్వారా కృత్రిమ ఆక్సిజన్ పంపింగ్ మిషన్ పనిచేస్తుందని, వెంటిలేటరు ఖాళీ కాగానే అతనికి అమర్చవచ్చని చెప్పారు. రంజనే సరేనన్నాడు. అయితే మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఏడున్నర వరకు వెంటిలేటర్లు ఏవీ ఖాళీ కాకపోవటంతో అతను బెలూన్ ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. తన బావ పరిస్థితి అంత ప్రమాదకరంగా ఉందని ఆయన మిగిలిన కుటుంబ సభ్యులకు చెప్పకపోవటంతో తనకు సహాయం చేయడానికి కూడా ఎవరూ అందుబాటులో లేరు. ఇద్దరు చిన్నపిల్లలున్న తన చెల్లెలికి కూడా రంజన్ ఈ విషయం చెప్పలేదు. ఎక్కడ బెలూన్ ఆపితే ప్రమోద్ ప్రాణం పోతుందేమో అనే భయంతో…చేతులు నొప్పి పెడుతున్నా అతను గంటల కొద్దీ బెలూన్ని నొక్కుతూ ఆక్సిజన్ మిషన్ పనిచేసేలా చేశాడు. చివరికి ఏడున్నర తరువాత ప్రమోద్‌కి వెంటిలేటర్ సదుపాయం అందింది.
ఈ సంఘటనపై స్పందించిన కెఇఎమ్ ఆసుపత్రి డీన్, డాక్టర్ అవినాష్ సుపే…ప్రయివేటు ఆసుపత్రులనుండి తమ వద్దకు ఎక్కువ సంఖ్యలో పేషంట్లు వస్తుంటారని, అలా పంపేటపుడు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది కూడా ఆయా ఆసుపత్రుల వారు చూసుకోరని అన్నారు. తమ వద్ద ఎమర్జన్సీ వార్డుల్లో ఉన్న 27తో సహా మొత్తం 100 వెంటిలేటర్లు ఉన్నాయని, ఒకవేళ ఒక్కటి కూడా ఖాళీగా లేనపుడు పేషంటు వస్తే…తామేమీ చేయలేమని, ఒక పేషంటు వెంటిలేటర్ తీసి మరొక పేషంటుకి పెట్టే అవకాశం ఉండదు కదా…అని ఆయన అన్నారు. వెంటిలేటర్లు లేనపుడు అత్యవసర చికిత్స అందించాల్సి వస్తే పేషంట్లను వేరొక ఆసుపత్రికి పంపుతామన్నారు. ఈ ఆసుపత్రిలో ఎమర్జన్సీ వార్డులో రోజూ 600మందికి పైగా పేషంట్లు ఉంటారు. భారత్‌లో వైద్యులు, వైద్య సదుపాయాల కొరత ఏ స్థాయిలో ఉందో ఈ పరిస్థితి చెబుతోంది.