25 జింకలు చనిపోయాయా?.. చంపేశారా?
కృష్ణా తీరంలో 25 జింకలు మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం రెవెన్యూ పరిధిలోని కృష్ణా తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన వనపర్తి అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసి హతాశయులయ్యారు. మొదట రెండో మూడో చనిపోయి ఉంటాయనుకున్నవారికి అక్కడి పరిసర ప్రాంతాల్లో గాలించేసరికి ఏకంగా 25 జింకల మృతదేహాలు లభించడంతో ఆందోళన చెందారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం […]
BY sarvi7 Aug 2016 4:37 AM IST

X
sarvi Updated On: 7 Aug 2016 6:37 AM IST
కృష్ణా తీరంలో 25 జింకలు మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం రెవెన్యూ పరిధిలోని కృష్ణా తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన వనపర్తి అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసి హతాశయులయ్యారు. మొదట రెండో మూడో చనిపోయి ఉంటాయనుకున్నవారికి అక్కడి పరిసర ప్రాంతాల్లో గాలించేసరికి ఏకంగా 25 జింకల మృతదేహాలు లభించడంతో ఆందోళన చెందారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఒకే చోట 25 పెద్ద జింకలు మృతి చెందడం రాష్ట్రస్థాయిలో అటవీ అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఈ జింకలు రాష్ట్ర జంతువుగా ఉండటమే దీనికి కారణం. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఈ జింకలు విషప్రయోగం వల్ల చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, విషగుళికలు చల్లిన మొక్కజొన్న పొలంలో గడ్డి మేయడం వల్ల ఇవి చనిపోయాయి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇది వేటగాళ్ల పని అయి ఉంటుందా?అన‌్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
Next Story