దోపిడి చేసి ఎన్ఐఎ అధికారికి 82 లక్షలు ఇచ్చాడు...తిరిగి ఇవ్వలేదని కాల్చి చంపాడు!
ఎన్ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మునీర్ పోలీసులకు హత్య వెనుక ఉన్న కారణాలను వెల్లడించాడు. ఒక గ్యాంగ్ స్టర్ కోసం ఫ్లాట్, పిస్టల్ కొనమని తాను తంజీల్‌కి 82 లక్షల రూపాయలు ఇచ్చానని, ఆయన వాటిని కొనకపోగా డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని మునీర్ తెలిపాడు. గతనెల 28న మునీర్ పట్టుబడగా పోలీసుల ఇంటరాగేషన్లో అతను పూర్తి నిజాలు వెల్లడించాడు. శనివారంతో ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్ పోలీస్ స్టేషన్లో అతని అయిదురోజుల పోలీస్ […]
ఎన్ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మునీర్ పోలీసులకు హత్య వెనుక ఉన్న కారణాలను వెల్లడించాడు. ఒక గ్యాంగ్ స్టర్ కోసం ఫ్లాట్, పిస్టల్ కొనమని తాను తంజీల్‌కి 82 లక్షల రూపాయలు ఇచ్చానని, ఆయన వాటిని కొనకపోగా డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని మునీర్ తెలిపాడు. గతనెల 28న మునీర్ పట్టుబడగా పోలీసుల ఇంటరాగేషన్లో అతను పూర్తి నిజాలు వెల్లడించాడు. శనివారంతో ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్ పోలీస్ స్టేషన్లో అతని అయిదురోజుల పోలీస్ కస్టడీ ముగుస్తుంది.
తంజీల్ అహ్మద్కి మునీర్ ఇచ్చిన డబ్బు రెండు భారీ దోపిడీల నుండి దోచుకున్నదని పోలీసులు వెల్లడించారు. అది దోపిడీల ద్వారా పొందిన డబ్బని తంజీల్కి తెలుసునని ఎస్పి ఉమేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. డబ్బు తీసుకున్న తంజీల్… ఫ్లాట్ని గాని, పిస్టల్ గాని కొనకపోవటంతో మునీర్కి ఆయనకు మధ్య విభేదాలు మొదలయ్యాయని, మునీర్ ఎంతగా అడిగినా తంజీల్ డబ్బుని తిరిగి ఇవ్వలేదని శ్రీవాస్తవ చెప్పారు. అంతేకాక తంజీల్… తన గురించి తన అనుచరుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారేమో అనే అనుమానం కూడా మునీర్కి కలిగిందని దాంతో అతను తంజీల్ని హత్య చేయటం జరిగిందని ఆయన వెల్లడించారు.
ఫ్లాట్ కోసం 60 లక్షలు, పిస్టల్కోసం 22 లక్షలు ఇచ్చినట్టుగా మునీర్ ఇంటరాగేషన్లో తెలిపాడు. ఇందులో 60 లక్షలను…2014లో ఉత్తర ఢిల్లీలో తన గ్యాంగ్తో కలిసి ఒక ఎటిఎమ్ దోపిడీ ద్వారా పొందిన 1.5 కోట్ల నుండి ఇచ్చాడు. మరో దోపిడీ ద్వారా పొందిన 91 లక్షల నుండి 22 లక్షలను పిస్టల్ కొనడానికి ఇచ్చాడు. తంజీల్ కి ఢిల్లీలోని ఆయన ఇంట్లోనే డబ్బుని ఇచ్చినట్టుగా మునీర్ తెలిపాడు. తంజీల్ ముజఫర్ నగర్లోని ఒక ముస్లిం మత గురువుని హత్య చేయమని తనకు చెప్పాడని మునీర్ చెబుతుండగా…పోలీసులు దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నారు.
పోలీసులు గురువారం మునీర్ని లక్నో తీసుకువెళ్లి అక్కడ అతను దాచిన… తంజీల్ హత్యకు వాడిన ఎ.9ఎమ్ఎమ్ పిస్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే పిస్టల్తో మునీర్ తంజీల్ని ఏప్రిల్ మూడున కాల్చి చంపాడు. ఆ కాల్పుల్లో గాయపడిన ఆయన భార్య చికిత్స పొందుతూ మరణించారు.