రాజీనామా డైలాగ్ బెడిసికొట్టింది...
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ముస్లింల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తారాపేటలోని మసీదు, ఖబర్‌స్తాన్ కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడం వివాదాస్పదమైంది. శుక్రవారం నమాజ్ ముగించుకున్నతర్వాత ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మౌన ప్రదర్శనకు దిగారు. విషయం తెలుసుకున్న జలీల్ ఖాన్ … నాయకత్వం వహించేందుకు తారాపేట మసీదు వద్దకు వచ్చారు. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. జలీల్ ఖాన్‌ను చూడగానే ముస్లింలు ఒక్కసారిగా పెద్దెత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా […]
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ముస్లింల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తారాపేటలోని మసీదు, ఖబర్‌స్తాన్ కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడం వివాదాస్పదమైంది. శుక్రవారం నమాజ్ ముగించుకున్నతర్వాత ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మౌన ప్రదర్శనకు దిగారు. విషయం తెలుసుకున్న జలీల్ ఖాన్ … నాయకత్వం వహించేందుకు తారాపేట మసీదు వద్దకు వచ్చారు. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. జలీల్ ఖాన్‌ను చూడగానే ముస్లింలు ఒక్కసారిగా పెద్దెత్తున నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. ఈ సమయంలో జలీల్ ఖాన్ చెప్పేది వినాలంటూ మత పెద్దలు సర్ధిచెప్పారు. దీంతో ప్రసంగం అందుకున్న జలీల్ ఖాన్ ఎప్పటిలాగే మసీదు నుంచి ఒక్క ఇటుక తీసినా రాజీనామా చేస్తా అని ప్రకటించారు. ఈ మాట వినగానే ముస్లిం యువకులు మళ్లీ నినాదాలు చేశారు. ఇప్పటికే రామవరప్పాడు మసీదును కూల్చివేశారని మరి ఎందుకు రాజీనామా చేయడం లేదు.. వెంటనే రాజీనామా చేయ్ అంటూ నిలదీశారు. రామవరప్పాడు మసీదు కూల్చివేతలో ప్రభుత్వానికి అండగా నిలిచి ముస్లింలను మభ్యపెట్టి ప్రభుత్వానికి అండగా నిలిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జలీల్ ఖాన్ బిత్తరపోయారు. మత పెద్దలు కూడా చేతులెత్తేశారు. దీంతో జలీల్ ఖాన్ అక్కడి నుంచి జారుకున్నారు.
తారాపేట మసీదు వద్ద రోడ్డు విస్తరణకు రైల్వే స్థలాన్ని తీసుకోవాలని.. ఆ దిశగా కేంద్ర మంత్రిని కలిసి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మత సంస్థలపై అన్యాయంగా వ్యవహరి స్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
Click on Image to Read:
Also Read కబాలిని కూడా వదల్లేదు..!