ఇలియానాకు ఉన్న సమస్యలేంటి...?
ప్రస్తుతం అడపాదడపా సినిమాలతో హిందీలో మెరుస్తూనే ఉంది ఇలియానా. అయితే స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. తాజాగా అక్షయ్ కుమార్ సరసన రుస్తుం అనే సినిమా కూడా చేసింది. ఇదిలా ఉండగా… రుస్తుం ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఇలియానా. ప్రస్తుతం తను వ్యక్తిగత ఇబ్బందులతో ఉన్నానని, మరికొన్నాళ్ల పాటు తనకు ఆ సమస్యలు తప్పవని… త్వరలోనే ఆ ఇబ్బందుల నుంచి కోలుకుంటానని చెప్పింది. ఇది విని జనాలు […]
BY sarvi6 Aug 2016 6:18 PM IST

X
sarvi Updated On: 6 Aug 2016 6:20 PM IST
ప్రస్తుతం అడపాదడపా సినిమాలతో హిందీలో మెరుస్తూనే ఉంది ఇలియానా. అయితే స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. తాజాగా అక్షయ్ కుమార్ సరసన రుస్తుం అనే సినిమా కూడా చేసింది. ఇదిలా ఉండగా… రుస్తుం ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఇలియానా. ప్రస్తుతం తను వ్యక్తిగత ఇబ్బందులతో ఉన్నానని, మరికొన్నాళ్ల పాటు తనకు ఆ సమస్యలు తప్పవని… త్వరలోనే ఆ ఇబ్బందుల నుంచి కోలుకుంటానని చెప్పింది. ఇది విని జనాలు షాక్ అయ్యారు. అయితే వ్యక్తిగత ఇబ్బందులంటే ఏంటనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇలియానా. అవి కుటుంబ సమస్యలా… లేక ఆర్థిక సమస్యలా… లేక ఆరోగ్య సమస్యలా అనే విషయాన్ని మాత్రం ఇలియానా చెప్పలేదు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా చాలా క్లోజ్ గా ఉంటుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిపై పరోక్షంగా స్పందించిన ఇలియానా… ఇప్పట్లో తను పెళ్లి చేసుకోనని.. కనీసం మరో ఏడాది అయినా గ్యాప్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంలోనే తనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ఇలియానా బయటపెట్టింది.
Next Story