ఫ్యాన్ వేసినా.. బీరువా తీసినా యాసిడ్ పడింది
ప్రకాశం జిల్లా పీసీపల్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో యాసిడ్ కలకలం రేగింది. కార్యాలయంలో సిబ్బంది ఫ్యాన్లు వేసినా.. బీరువాలు తీసినా అందులో యాసిడ్‌నింపిన గిన్నెలు మీదపడటంతో గాయపడ్డారు. వివరాలు శుక్రవారం యధావిధిగా తహసీల్దారు కార్యాలయాన్ని తెరిచారు. తహసీల్దారు గదిలోని ఫ్యాన్ వేయగానే దానిపై ఉన్న యాసిడ్ గిన్నె ఒలికి అక్కడున్న సిబ్బందిపై పడింది. ఈ ఘటనలో వారు స్వల్పంగా గాయపడ్డారు. మరో సిబ్బంది బీరువాలు తెరిచేందుకు ప్రయత్నించగా అప్పటికే పెట్టి ఉంచిన యాసిడ్ గిన్నెలు మీదపడటంతో గాయపడ్డారు. […]
BY sarvi6 Aug 2016 2:39 AM IST
sarvi Updated On: 6 Aug 2016 6:27 AM IST
ప్రకాశం జిల్లా పీసీపల్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో యాసిడ్ కలకలం రేగింది. కార్యాలయంలో సిబ్బంది ఫ్యాన్లు వేసినా.. బీరువాలు తీసినా అందులో యాసిడ్‌నింపిన గిన్నెలు మీదపడటంతో గాయపడ్డారు. వివరాలు శుక్రవారం యధావిధిగా తహసీల్దారు కార్యాలయాన్ని తెరిచారు. తహసీల్దారు గదిలోని ఫ్యాన్ వేయగానే దానిపై ఉన్న యాసిడ్ గిన్నె ఒలికి అక్కడున్న సిబ్బందిపై పడింది. ఈ ఘటనలో వారు స్వల్పంగా గాయపడ్డారు. మరో సిబ్బంది బీరువాలు తెరిచేందుకు ప్రయత్నించగా అప్పటికే పెట్టి ఉంచిన యాసిడ్ గిన్నెలు మీదపడటంతో గాయపడ్డారు. బీరువాలోని కొన్నిఫైళ్లు మాయమయ్యాయి. దీంతోపాటు తహసీల్దారును బెదిరిస్తూ రాసిన లేఖ కూడా దొరికింది. వరుస ఘటనలతో ఆందోళన చెందిన తహసీల్దార్ మౌలానా సాహెబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి సిబ్బందిని విచారించారు. కొన్ని ఫైళ్లు మాయం కావడాన్ని సైతం సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. కొంతకాలంగా ఈ తహసీల్దారు కార్యాలయంలోని రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story