పథకాలు వైఎస్‌వి.. శంకుస్థాపనలు మీవా?
పలు పథకాలకు శంకుస్థాపనలు చేయడానికి ప్రధాని ఆగస్టు 7న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పథకాలు తమవేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన పథకాలకు ఇప్పుడు పేర్లు మార్చి మీవని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ- టీఆర్ ఎస్ పార్టీలకు పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాకే.. మీరు ఆ పథకాలకు ప్రారంభోత్సవాలు చేసుకోండని సూచిస్తున్నారు. ఉత్తమ్ సంధించిన ప్రశ్నలివే! 1. […]
BY admin5 Aug 2016 12:36 AM GMT
X
admin Updated On: 5 Aug 2016 2:36 AM GMT
పలు పథకాలకు శంకుస్థాపనలు చేయడానికి ప్రధాని ఆగస్టు 7న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పథకాలు తమవేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన పథకాలకు ఇప్పుడు పేర్లు మార్చి మీవని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ- టీఆర్ ఎస్ పార్టీలకు పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాకే.. మీరు ఆ పథకాలకు ప్రారంభోత్సవాలు చేసుకోండని సూచిస్తున్నారు.
ఉత్తమ్ సంధించిన ప్రశ్నలివే!
1. అప్పటి సీఎం వైఎస్ చేపట్టిన జలయజ్ఞం పనులకే మిషన్ భగీరథ అని పేరు మార్చారు. ప్రాణహిత – చేవెళ్ల 2008లో తాము ప్రారంభించామని గుర్తుచేశారు. ఇందులో భాగంగా 30 టీఎంసీలను హైదరాబాద్‌కు తరలించేందుకు మౌలానా సుజల స్రవంతి పేరుతో ఎల్లంపల్లి, మానేరుల ప్రాజెక్టుల నుంచి రాజధానికి గోదావరి నీటిని తరలించే ప్రాజెక్టును నిర్మించింది తామేనన్నారు. ఇది గతేడాది పూర్తయితే పేరు మార్చి మిషన్ భగీరథలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు.
2. ఇప్పుడు దాదాపుగా పూర్తయిన దేవాదుల, ఎల్లంపల్లి ప్రాజెక్టులు తాము జలయజ్ఞంలో భాగంగా చేపట్టినవేనని స్పష్టం చేశారు.
3. ఆయా ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో భూసేకరణ, బ్యాంకురుణాలు, నిర్వాసితుల పునరావాసం తదితరాలు పూర్తి చేసింది తమ పార్టీనేనని మరువకూడదన్నారు.
4. సినిమా చివర్లలో పోలీసులు వచ్చినట్లుగా మేము పూర్తి చేసిన పథకాలకు పేర్లు మార్చి మీరు ప్రారంభించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పథకాలకు ప్రధాని వచ్చి ప్రారంభోత్సవం చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ ఒకసారి పునరాలోచించుకోవాలని హితవు పలికారు.
Next Story