అంటరానివారు వండుతున్నారంటూ...ఆహారాన్ని తిరస్కరించారు!
ఉత్తర ప్రదేశ్‌లో కులవివక్ష ప్రభుత్వ పథకాల్లోకి పాకింది. గర్భిణులకు పోషకాహారం అందించడానికి హాస్లా పోషణ్ యోజన అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో… గ్రామాల్లో గర్భిణులకు పోషకాహారాన్ని వండి అందిస్తున్నారు. ఈ ఆహారాన్ని అంగన్‌వాడీ వర్కర్లు తయారు చేస్తున్నారు. వారంతా షెడ్యూల్డు కులాలకు చెందిన వారు కాగా… ఎగువ కులాలకు చెందిన మహిళలు ఆ ఆహారాన్ని తీసుకోవడానికి తిరస్కరిస్తున్నారు. గత నెల 20న ప్రారంభమైన ఈ పథకాన్ని నాలుగుదశల్లో రాష్ట్రంలో అమలు చేస్తూ గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించాలని భావిస్తున్నారు. వండిన ఆహారంతో పాటు ఒక పండుని […]
ఉత్తర ప్రదేశ్‌లో కులవివక్ష ప్రభుత్వ పథకాల్లోకి పాకింది. గర్భిణులకు పోషకాహారం అందించడానికి హాస్లా పోషణ్ యోజన అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో… గ్రామాల్లో గర్భిణులకు పోషకాహారాన్ని వండి అందిస్తున్నారు. ఈ ఆహారాన్ని అంగన్‌వాడీ వర్కర్లు తయారు చేస్తున్నారు. వారంతా షెడ్యూల్డు కులాలకు చెందిన వారు కాగా… ఎగువ కులాలకు చెందిన మహిళలు ఆ ఆహారాన్ని తీసుకోవడానికి తిరస్కరిస్తున్నారు. గత నెల 20న ప్రారంభమైన ఈ పథకాన్ని నాలుగుదశల్లో రాష్ట్రంలో అమలు చేస్తూ గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించాలని భావిస్తున్నారు. వండిన ఆహారంతో పాటు ఒక పండుని అందిస్తున్నారు. అయితే పిలిభిత్ జిల్లాలోని ధాన్‌కునా అనే ఒక్క గ్రామంలోనే 18 మంది ఎగువ కులాల గర్భిణులు….షెడ్యూలు కులానికి చెందిన అంగన్‌వాడీ మహిళ వండిన ఆహారాన్ని తీసుకునేందుకు నిరాకరించారని అక్కడి జిల్లా ప్రోగ్రామ్ అధికారి వెల్లడించారు. అలాగే ఒక గవర్నమెంటు ప్రాథమిక స్కూలులో షెడ్యూలు క్యాస్ట్ మహిళ ఆహారాన్ని వండుతున్నదనే కారణంతో ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినటం మానేశారు. ఆగ్రాల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని … దళిత అంగన్‌వాడీ వర్కర్లు వండిన ఆహారాన్ని ఎగువ కులాల మహిళలు ఇలా నేరుగా తిరస్కరించడం మొదటిసారి చూస్తున్నామని అధికారులు అంటున్నారు.