రాజ్యసభలో సుజనా చౌదరి దిగ్భ్రాంతికర ప్రవర్తన
టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి మరోసారి తన అసలు రూపం బయటపెట్టారు. తనకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా బీజేపీ వద్ద మెప్పు పొందడమే ముఖ్యమని చాటుకున్నారు. కేవీపీ బిల్లు … మనీ బిల్లా కాదా అన్నది తాము నిర్ధారించలేమని కాబట్టి ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్ సూచన కోరాల్సి ఉందంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్ బిల్లుపై ఓటింగ్‌ను తిరస్కరించారు. ఈసమయంలో బీజేపీ సభ్యులంతా హర్షం వ్యక్తంచేస్తూ బల్లలు చరిచారు. తమదే పైచేయి అయిందని కాంగ్రెస్, ఏపీ సభ్యులను […]
టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి మరోసారి తన అసలు రూపం బయటపెట్టారు. తనకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా బీజేపీ వద్ద మెప్పు పొందడమే ముఖ్యమని చాటుకున్నారు. కేవీపీ బిల్లు … మనీ బిల్లా కాదా అన్నది తాము నిర్ధారించలేమని కాబట్టి ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్ సూచన కోరాల్సి ఉందంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్ బిల్లుపై ఓటింగ్‌ను తిరస్కరించారు. ఈసమయంలో బీజేపీ సభ్యులంతా హర్షం వ్యక్తంచేస్తూ బల్లలు చరిచారు. తమదే పైచేయి అయిందని కాంగ్రెస్, ఏపీ సభ్యులను హేళన చేస్తూ నినాదాలు చేశారు.
కేవీపీ బిల్లుపై ఓటింగ్ జరక్కపోయే సరికి తెలుగువారంతా నిరాశకు లోనయ్యారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండి కూడా బీజేపీ సభ్యులతో కలిసి కేంద్రమంత్రి సుజనా చౌదరి గట్టిగా బల్లలు చరిచారు. ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్‌కు డిప్యూటీ చైర్మన్ తిరస్కరిస్తే బాధపడాల్సింది పోయి సుజనా చౌదరి మాత్రం బహిరంగంగా హర్షం వ్యక్తం చేయడం చూసి సభలోని సభ్యులంతా అవాక్కయ్యారు. నిన్నటి వరకు కేవీపీ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని చెప్పిన సుజనా చౌదరి ఇప్పుడు మాత్రం బిల్లుపై ఓటింగ్ జరక్కపోవడంతో బల్లలు చరిచి హర్షంవ్యక్తం చేయడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీకి చెందిన ఎంపీలు నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది. ఈ సమయంలో కనీసం వారిని సంఘీభావం కూడా తెలపకుండా టీడీపీ సభ్యులు బీజేపీ సభ్యులతో కలిసి బయటకువెళ్లిపోయారు.
Click on Image to Read:
Also Read కబాలిని కూడా వదల్లేదు..!