అధిక బరువున్నారా... మెదడు వయసు అదనంగా పదేళ్లు పెరిగినట్టే!
నడి వయసుకి చేరినవారిలో… శరీరం బరువు పెరిగిన కొద్దీ వారి మెదడు వయసు మరింతగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని వివిధ భాగాలను అనుసంధానించే కనెక్టివ్ కణజాలం (తెలుపు పదార్థం) అధికబరువు ఉన్నవారిలో… సన్నగా ఉన్నవారిలో కంటే తక్కువగా ఉండటం పరిశోధకులు గుర్తించారు. అంటే… అధికబరువున్న 40ఏళ్ల వ్యక్తి మెదడు…తనకంటే పదేళ్లు ఎక్కువ వయసున్నవారి మెదడుతో సమానంగా క్షీణిస్తుందని న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ అనే వైద్యపరమైన పత్రికలో పేర్కొన్నారు. అధిక బరువున్న వ్యక్తుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ …ఈ […]
నడి వయసుకి చేరినవారిలో… శరీరం బరువు పెరిగిన కొద్దీ వారి మెదడు వయసు మరింతగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని వివిధ భాగాలను అనుసంధానించే కనెక్టివ్ కణజాలం (తెలుపు పదార్థం) అధికబరువు ఉన్నవారిలో… సన్నగా ఉన్నవారిలో కంటే తక్కువగా ఉండటం పరిశోధకులు గుర్తించారు. అంటే… అధికబరువున్న 40ఏళ్ల వ్యక్తి మెదడు…తనకంటే పదేళ్లు ఎక్కువ వయసున్నవారి మెదడుతో సమానంగా క్షీణిస్తుందని న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ అనే వైద్యపరమైన పత్రికలో పేర్కొన్నారు.
అధిక బరువున్న వ్యక్తుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ …ఈ పదేళ్ల గ్యాప్ అనేది అలాగే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మన వయసు పెరుగుతున్న కొద్దీ మన మెదడు కుచించుకుపోతుందని పరిశోధనకు సారధ్యం వహించిన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ సైకియాట్రి డిపార్ట్‌మెంట్ శాస్త్రవేత్త లీసా రోనన్ తెలిపారు. మెదడులోని వివిధ భాగాలను అనుసంధానం చేసే కణజాలం వైట్ మ్యాటర్ అనేది అధికబరువున్నవారిలో… సన్నగా ఉన్నవారితో పోలిస్తే త్వరగా హరించుకుపోతుందని లీసా తెలిపారు.
అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక సందిగ్దంలో ఉన్నారని లీసా అన్నారు. బరువు పెరగటం వలన మెదడులో తెలుపు పదార్థం (వైట్ మ్యాటర్) తగ్గుతోందా…లేదా అది తగ్గటం వల్లనే వ్యక్తులు బరువు పెరుగుతున్నారా అనేది తేలాల్సి ఉందని ఆమె అన్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తేలియాల్సి ఉందన్నారామె. లీసా, ఆమె కొలీగ్స్ కలిసి 500 మంది 20 నుండి 87 మధ్య వయసున్నవారిపై అధ్యయనం నిర్వహించారు. అధికబరువున్న వారిలో మెదడులోని తెలుపు పదార్థం తగ్గటం అనేది ….వారు నడి వయసుకి చేరినప్పటినుండే మొదలవుతున్నట్టుగా గుర్తించారు. దీన్ని బట్టి నడివయసులో అధికబరువు… మెదడుపై మరింత ప్రభావాన్ని చూపి, మెదడు వయసుని పదేళ్లు పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని వారు వెల్లడించారు.