తండ్రి పార్టీ.. నాకు అత్తారిల్లులా ఉంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. నిజామాబాద్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పార్టీ తనకు అత్తారిల్లులా ఉందని మీడియాతో అన్నారు. అంటే ఏంటి? ఆమెకు అక్కడ ఇబ్బందిగా ఉందనా? అనుకున్నారు మీడియా ప్రతినిధులంతా.. వారంతా కన్‌ఫ్యూజ్ అయ్యారని గమనించిన కవిత వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం ఇక్కడ ఇబ్బంది పడుతున్నానని కాదు. ఇక్కడ అంతా బానే ఉందని చెప్పుకొచ్చారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన తెలంగాణ జాగృతి సంస్థే తనకు […]
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. నిజామాబాద్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పార్టీ తనకు అత్తారిల్లులా ఉందని మీడియాతో అన్నారు. అంటే ఏంటి? ఆమెకు అక్కడ ఇబ్బందిగా ఉందనా? అనుకున్నారు మీడియా ప్రతినిధులంతా.. వారంతా కన్‌ఫ్యూజ్ అయ్యారని గమనించిన కవిత వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం ఇక్కడ ఇబ్బంది పడుతున్నానని కాదు. ఇక్కడ అంతా బానే ఉందని చెప్పుకొచ్చారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన తెలంగాణ జాగృతి సంస్థే తనకు మాతృపార్టీ అని అసలు విషయం వెల్లడించింది. తెలంగాణ సాధన కోసం పలు ఉద్యమాలకు ఆ వేదిక నుంచే తాను శ్రీకారం చుట్టానని గుర్తు చేసుకున్నారు. తన సొంత వేదిక తన కన్నతల్లిలాంటిది అని చెప్పుకుంటూ మురిసిపోయారు. తనకు తెలంగాణతోపాటు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకవచ్చిన తెలంగాణ జాగృతిని ఎన్నటికీ మరువలేనని అన్నారు.
కవిత వివరణతో విలేకరులు అంతా సంతృప్తి చెందారు. కవిత తెలంగాణ జాగృతిని అధికారపార్టీలో విలీనం చేశారు. అయినా ఈ వేదిక ఆ పార్టీకి అనుబంధ శాఖగా కొనసాగుతోంది. ఒక్క తెలంగాణలోనే కాకుండా పొరుగురాష్ర్టాలు, లండన్,దుబాయ్, ఆస్ర్టేలియా, అమెరికా తదితర దేశాలలో ఈ వేదిక ద్వారా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయా దేశాల్లో దసరా,బతుకమ్మ, దీపావళి తదితర వేడుకలను నిర్వహిస్తున్నారు. తనకు సొంతపార్టీ కంటే తెలంగాణ జాగృతే ఎక్కువ గుర్తింపు తెచ్చిందన్నది కవిత అభిప్రాయం అన్నమాట.
Click on Image to Read:
Also Read కబాలిని కూడా వదల్లేదు..!