Telugu Global
Cinema & Entertainment

దీపిక ప‌దుకోణ్ ఒలింపిక్స్ డ్రీమ్..!

సాధార‌ణంగా హీరోయిన్స్ అంటే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ నేప‌థ్యంగా వ‌చ్చే వాళ్లు చాల త‌క్కువ‌. కానీ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రైన దీపిక ప‌దుకోణ్ మాత్రం మంచి క్రీడా నేప‌థ్యం ఉన్నకుటూంబం నుంచి వ‌చ్చింది. వాళ్ల డాడి ప్ర‌కాష్ ప‌దుకోణ్ షెటిల్ బ్యాట్మెంట్ న్ ఆల్ టైమ్ ఇంగ్లాండ్ ఛాంపియ‌న్ షిప్ సాధించిన తొలిభార‌తీయ క్రీడా కారుడు. షెటిల్ బ్యాట్మెంట్ న్ లో త‌న కూతురు దీపిక కు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. దీపిక ప‌దుకోణ్ […]

దీపిక ప‌దుకోణ్ ఒలింపిక్స్ డ్రీమ్..!
X

సాధార‌ణంగా హీరోయిన్స్ అంటే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ నేప‌థ్యంగా వ‌చ్చే వాళ్లు చాల త‌క్కువ‌. కానీ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రైన దీపిక ప‌దుకోణ్ మాత్రం మంచి క్రీడా నేప‌థ్యం ఉన్నకుటూంబం నుంచి వ‌చ్చింది. వాళ్ల డాడి ప్ర‌కాష్ ప‌దుకోణ్ షెటిల్ బ్యాట్మెంట్ న్ ఆల్ టైమ్ ఇంగ్లాండ్ ఛాంపియ‌న్ షిప్ సాధించిన తొలిభార‌తీయ క్రీడా కారుడు. షెటిల్ బ్యాట్మెంట్ న్ లో త‌న కూతురు దీపిక కు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. దీపిక ప‌దుకోణ్ నేష‌నల్ లెవల్ లో కూడా ఆడారు.

ఆ త‌రువాత ఐశ్వ‌ర్య అనే క‌న్న‌డ సినిమాకు చాన్స్ రావ‌డం. ఆ త‌రువాత ఓంశాంతి ఓం అంటూ బాలీవుడ్ జ‌ర్నీ. ఆ త‌రువాత అన‌తి కాలంలోనే న‌టిగా.. ల‌వ్ ఎఫైర్స్.. గ్లామ‌ర్ హీరోయిన్ గా ఇలా దీపిక ఒక సంచ‌ల‌నం. ప్ర‌స్తుతం హాలీవుడ్ చిత్రంతో త‌న స‌త్తాను చాట‌నుంది. ఒకవేళ నేను బ్యాడ్మింటన్‌లో కొనసాగి జాతీయ జట్టుకు ఎంపికై ఉంటే ఒలింపిక్స్‌కు వెళ్లేదాన్నేమో. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం ఎవరికైనా గర్వించదగ్గ విషయం. బ్యాడ్మింటన్‌ క్రీడాకారులే కాదు… నేటి నుంచి రియోలో ప్రారంభం కాబోతున్న ఒలింపిక్స్‌లో ఆడనున్న భారత ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. మనదేశానికి పతకాలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. వాళ్లకు ఆల్‌ ద బెస్ట్’’ ఇక సినిమా ప‌రంగా సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘పద్మావతి’ కోసం రూ.12.65 కోట్లు పారితోషికం దక్కించుకుందని సమాచారం.

Also Read “శ్రీరస్తు శుభమస్తు” సినిమా రివ్యూ

రేపట్నుంచే పవన్ సినిమా…

సుకుమార్ నుంచి మరో క్రేజి ప్రాజెక్టు…

First Published:  5 Aug 2016 4:33 AM
Next Story