నన్ను మండలిలో మెజారిటీ నిరూపించుకోమంటే ఎలా?
రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్‌ను నిరాకరించడంపై చంద్రబాబు చాలా జాగ్రత్తగా స్పందించారు. కాంగ్రెస్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే జీఎస్టీ బిల్లుకు, ప్రత్యేక హోదా బిల్లుకు లింక్ పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. రాజ్యసభలో మనీ బిల్లు పెట్టిన ఉదంతాలు లేవన్నారు. ఒకవేళ ప్రైవేట్ బిల్లు నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుందని కాబట్టి బీజేపీ వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పార్టీ అయినా […]
రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్‌ను నిరాకరించడంపై చంద్రబాబు చాలా జాగ్రత్తగా స్పందించారు. కాంగ్రెస్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే జీఎస్టీ బిల్లుకు, ప్రత్యేక హోదా బిల్లుకు లింక్ పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. రాజ్యసభలో మనీ బిల్లు పెట్టిన ఉదంతాలు లేవన్నారు. ఒకవేళ ప్రైవేట్ బిల్లు నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుందని కాబట్టి బీజేపీ వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏ పార్టీ అయినా రాజ్యసభలో మేజారిటీ సాధించాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగేళ్లు పడుతుందని చంద్రబాబు చెప్పారు. ” ఇప్పుడు నేను అసెంబ్లీ ద్వారా ఎన్నికయ్యా… వెళ్లి కౌన్సిల్‌లో మేజారిటీ నిరూపించుకో లేకుంటే రాజీనామా చేయ్ అంటే ఎలా?. మొన్నటి వరకు మాకు కూడా మండలిలో మేజారిటీ లేదు” అంటూ పరోక్షంగా రాజ్యసభలో ప్రత్యేకహోదా బిల్లుపై ఓటింగ్ జరగకపోవడాన్ని చంద్రబాబు సమర్థించారు. ప్రధానిని కలిసి రాష్ట్రానికి కావాల్సిన వాటిపై వివరించానన్నారు. బిల్లుపై ఓటింగ్‌ను డిప్యూటీ చైర్మన్ తిరస్కరించిన వెంటనే కేంద్రమంత్రి సుజనా చౌదరి సభలో బల్లలు చరచడాన్ని ప్రస్తావించగా అలా చేయడం తప్పు అని సుజనా తెలిసో తెలియకో చేసి ఉంటారన్నారు చంద్రబాబు .ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన చంద్రబాబు అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించారు.
Click on Image to Read:
Also Read కబాలిని కూడా వదల్లేదు..!