Telugu Global
Cinema & Entertainment

దానికే కట్టుబడి ఉన్న సునీల్

జక్కన్న ఫ్లాప్ తర్వాత సునీల్ పై చాలా అనుమానాలు పెరిగాయి. అతడు ఇక హీరో వేషాలు కట్టిపడేస్తారని కొందరన్నారు. మరోవైపు చిరంజీవి 150వ సినిమాలో కామెడీ పాత్ర చేసేందుకు ఒప్పుకోవడంతో… సునీల్ ఇకపై మరోసారి కమెడియన్ గా మారబోతున్నాడని మరికొందరు ఊహించారు. కానీ సునీల్ మాత్రం గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో హీరోగానే కొనసాగాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జక్కన్న రిజల్ట్ తేడా కొట్టినప్పటికీ సునీల్ మనసులో మార్పు రాలేదు. ఎలాగైనా హీరోగానే కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు […]

దానికే కట్టుబడి ఉన్న సునీల్
X

జక్కన్న ఫ్లాప్ తర్వాత సునీల్ పై చాలా అనుమానాలు పెరిగాయి. అతడు ఇక హీరో వేషాలు కట్టిపడేస్తారని కొందరన్నారు. మరోవైపు చిరంజీవి 150వ సినిమాలో కామెడీ పాత్ర చేసేందుకు ఒప్పుకోవడంతో… సునీల్ ఇకపై మరోసారి కమెడియన్ గా మారబోతున్నాడని మరికొందరు ఊహించారు. కానీ సునీల్ మాత్రం గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో హీరోగానే కొనసాగాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జక్కన్న రిజల్ట్ తేడా కొట్టినప్పటికీ సునీల్ మనసులో మార్పు రాలేదు. ఎలాగైనా హీరోగానే కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి కథల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం వీడు గోల్డ్ ఎహే అనే సినిమా చేస్తున్న సునీల్… తన భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి రచయితలు, దర్శకులకు క్లియర్ కట్ గా ఓ విషయం చెప్పేశాడు. తన కోసం రాసే కథల్లో ఎలాంటి ట్రాజడీ సన్నివేశాలు ఉండకూడదని, సీరియస్ గా ఉండే సన్నివేశాలు అస్సలు పెట్టొద్దని గట్టిగానే చెప్పాడు. ఇంకా చెప్పాలంటే… ఔట్ అండ్ ఔట్ కామెడీ కథలకే రాయమని సూచించాడు. ఇప్పటివరకు తన రేంజ్ కామెడీని పండించలేకపోయాడు సునీల్. ఇతడి కామెడీ టైమింగ్ ను పూర్తిస్థాయిలో వాడుకునే కథ ఇప్పటివరకు రాలేదు. అందుకే సునీల్ ఇప్పుడు అలాంటి కథల కోసం వెయిట్ చేస్తున్నాడు. పనిలోపనిగా కొన్ని పరభాషా చిత్రాలు కూడా పరిశీలిస్తున్నాడు.

First Published:  4 Aug 2016 3:56 AM IST
Next Story