కబాలిని కూడా వదల్లేదు..!
ఈ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. రిలీజ్ కు ముందు కనీ విని ఎరగని రీతిలో ఈ చిత్రం బిజినెస్ చేసింది. ఆఫ్ కోర్స్ విడుదలైన తరువాత బిజినెస్ ఎంత జరిగింది. ఎవరు గెయిన్ అయ్యారు. ఎవరు నష్టపోయారు అనేది వాళ్లకే తెలియాలి.ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ విషయాలు బయటకు వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు అనేది పరిశీలకుల వాదన. ఇదిలా వుంటే […]
BY sarvi4 Aug 2016 10:08 AM IST

X
sarvi Updated On: 4 Aug 2016 1:15 PM IST
ఈ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. రిలీజ్ కు ముందు కనీ విని ఎరగని రీతిలో ఈ చిత్రం బిజినెస్ చేసింది. ఆఫ్ కోర్స్ విడుదలైన తరువాత బిజినెస్ ఎంత జరిగింది. ఎవరు గెయిన్ అయ్యారు. ఎవరు నష్టపోయారు అనేది వాళ్లకే తెలియాలి.ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ విషయాలు బయటకు వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు అనేది పరిశీలకుల వాదన.
ఇదిలా వుంటే రజనీకాంత్ ట్విటర్ ఖాత హ్యాక్ అయ్యిందనే వార్త నెట్ లో హల్ చల్ చేసింది. సాధారణంగా యాక్టివ్ గా ఉండని ఆయన ట్విటర్ ఎకౌంట్ ఒక్కసారిగా యాక్టివ్ కావడంలో రజనీకాంత్ అభిమానులు గమనించి ఆయనకు సమచారం అందించారట. వెంటనే రజనీకాంత్ తనయ ఐశర్వ గమనించి తన తండ్రి ట్విటర్ ఎకౌంట్ హ్యాక్ కు గురైనట్లు పోలీసు కంప్లైట్ ఇచ్చారట.. హ్యాకింగ్ వెనకున్న వారికోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. రజినీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించి సమాచారం అందించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
Next Story