కరణంకు గట్టి షాక్...
కరణం బలరాం. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ కోటాలో చంద్రబాబుతో పాటు మంత్రి పదవికి పోటీ పడిన వ్యక్తి. చివరకు పదవి ఇద్దరికీ దక్కకుండా పోతుందని చంద్రబాబు బతిమలాడుకోవడంతో ఒక మెట్టు దిగి మంత్రి పదవి త్యాగం చేశారు బలరాం. ఈ మంత్రి పదవి సాయంతోనే చంద్రబాబు ఎన్టీఆర్‌కు అల్లుడైపోయారు. కరణం బలరాం మాత్రం ఒక స్థాయి వరకే ఎదిగారు. అయినప్పటికీ టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీని నమ్ముకునే పనిచేశారు. ఇప్పుడు మాత్రం కరణం బలరాంకు చంద్రబాబు, ఆయన తనయుడు […]
కరణం బలరాం. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ కోటాలో చంద్రబాబుతో పాటు మంత్రి పదవికి పోటీ పడిన వ్యక్తి. చివరకు పదవి ఇద్దరికీ దక్కకుండా పోతుందని చంద్రబాబు బతిమలాడుకోవడంతో ఒక మెట్టు దిగి మంత్రి పదవి త్యాగం చేశారు బలరాం. ఈ మంత్రి పదవి సాయంతోనే చంద్రబాబు ఎన్టీఆర్‌కు అల్లుడైపోయారు. కరణం బలరాం మాత్రం ఒక స్థాయి వరకే ఎదిగారు. అయినప్పటికీ టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీని నమ్ముకునే పనిచేశారు. ఇప్పుడు మాత్రం కరణం బలరాంకు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పొగ పెడుతున్నారు.
ఇటీవలే పార్టీలోకి ఫిరాయించిన గొట్టిపాటి రవికుమార్‌కే జై కొట్టారు. బుధవారం అద్దంకి నియోజవకర్గంలోని బల్లికురవలో గొట్టిపాటి రవికుమార్ తన వర్గానికి పించన్లు పంపిణీ చేస్తుండగా కరణం బలరాం వచ్చి తన వర్గీయుల సాయంతో టెంట్లను కూల్చివేశారు. పించన్లు పంపిణీ చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. చేదు అనుభవంతో ఏమీ చేయలేకపోయిన గొట్టిపాటి .. వెంటనే చంద్రబాబు, లోకేష్‌కు ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో సాయంత్రానికే కరణం బలరాంకు అనుకూలంగా పనిచేస్తున్న అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌పై బదిలీ వేటు వేశారు. ఇన్‌చార్జ్ సీఐగా రాఘవేంద్రను నియమించారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే…
లోకేష్‌పై ఒత్తిడి తెచ్చి బేతపూడి ప్రసాద్‌ను కొద్ది నెలల క్రితమే గొట్టిపాటి రవికుమార్ బదిలీ చేయించారు. విషయం తెలుసుకుని ఆగ్రహించిన కరణం బలరాం నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడారు. సీఐ బదిలీ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఆఘమేఘాల మీద బదిలీ నిలిపివేశారు. జూన్‌లో ఒకసారి సీఐ బేతపూడి ప్రసాద్‌ను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇప్పించారు లోకేష్. అప్పుడు కూడా కరణం ఆగ్రహంతో నారావారు వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు మాత్రం కరణం బలరాం అభ్యంతరాలను లెక్క చేయలేదు. బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేసేశారు. డీఎస్పీపైనా వేటు పడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఐ బదిలీతో గొట్టిపాటి వర్గం సంబరపడుతోంది. అంతిమంగా తమదే పై చేయి అయిందని కాలర్ ఎగరేస్తున్నారు. సీఐ బదిలీతో కరణం వర్గం మాత్రం షాక్ తింది. ఒక విధంగా చంద్రబాబు తమ నేతకు పొగపెడుతున్నారన్న నిర్ధారణకు బలరాం వర్గం వచ్చేసింది. గతంలో సీఐను బదిలీ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన కరణం బలరాం ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి!.
Click on Image to Read: