అమరావతి విషతుల్యం అయిందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం కాలుష్యకోరల్లో చిక్కుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు వాటి పరిసరప్రాంతాలు వాయు, జల, ధ్వని కాలుష్కాలకు నెలవుగా మారాయి. ఈ కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత కాలుష్క కారక నగరాల జాబితాలో విజయవాడ, గుంటూరును చేర్చారు. ఈ నివేదిక ప్రకారం గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రజలు రోజుకు వంద టన్నుల కాలుష్యాన్ని […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం కాలుష్యకోరల్లో చిక్కుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు వాటి పరిసరప్రాంతాలు వాయు, జల, ధ్వని కాలుష్కాలకు నెలవుగా మారాయి. ఈ కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత కాలుష్క కారక నగరాల జాబితాలో విజయవాడ, గుంటూరును చేర్చారు. ఈ నివేదిక ప్రకారం గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రజలు రోజుకు వంద టన్నుల కాలుష్యాన్ని పీలుస్తున్నారని అంచనా.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రతి ఎనిమిది గంటలకు క్యూబిక్ మీటర్ గాలిలో 400 గ్రాముల వరకు కార్బన్ మోనాక్సైడ్ ఉండవచ్చు. కానీ విజయవాడ ఆటోనగర్‌లో ఇది ఏకంగా 4000లుగా ఉంది. వాణిజ్య, నివాస ప్రాంతాల్లో 2000 గ్రాములుగా ఉంది.
రాజధాని ప్రాంతంలో జలాలు కూడా పూర్తి స్థాయిలో విషమయం అయ్యాయి. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా భూగర్భ జలాల్లో యాసిడ్ రేంజ్ భారీగా పెరిగింది. విజయవాడ నగరం మధ్యనుంచి వెళ్లే ఏలూరు, బందరు, రైవస్ కాల్వల్లో జల కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. గుంటూరుకు తాగునీరు అందించే గుంటూరు చానల్‌కూడా కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్టు కేంద్రసంస్థల నివేదిక తేల్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే మినహా ఈ ప్రాంతాలను కాలుష్క కోరల నుంచి రక్షించడం కష్టమంటున్నారు. కాలుష్యం వల్ల ఊపరితిత్తుల సమస్యలు, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Click on Image to Read: