తనకి నిప్పంటించుకుని...ఆమెని పట్టుకున్నాడు!
తమిళనాడులో టెకీ స్వాతి హత్య తరువాత ప్రేమ వేధింపులకు మరొక యువతి బలైపోయింది. విల్లుపురంకి చెందిన 17ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో సెంథిల్ (32) అనే వ్యక్తి దాదాపు సంవత్సరంన్నర కాలంగా వేధిస్తున్నాడు. అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత శనివారం ఆమె తనకంటే చిన్నవాళ్లయిన తోబుట్టువులతో కలిసి ఇంట్లో ఉండగా సెంథిల్ ఇంట్లోకి ప్రవేశించాడు. తనపైన కిరోసిన్ చల్లుకుని నిప్పు అంటించుకున్నాడు. తరువాత యువతిని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో మంటలు ఆమెకు కూడా వ్యాపించాయి. కాలిన గాయాలతో […]
తమిళనాడులో టెకీ స్వాతి హత్య తరువాత ప్రేమ వేధింపులకు మరొక యువతి బలైపోయింది. విల్లుపురంకి చెందిన 17ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో సెంథిల్ (32) అనే వ్యక్తి దాదాపు సంవత్సరంన్నర కాలంగా వేధిస్తున్నాడు. అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత శనివారం ఆమె తనకంటే చిన్నవాళ్లయిన తోబుట్టువులతో కలిసి ఇంట్లో ఉండగా సెంథిల్ ఇంట్లోకి ప్రవేశించాడు. తనపైన కిరోసిన్ చల్లుకుని నిప్పు అంటించుకున్నాడు. తరువాత యువతిని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో మంటలు ఆమెకు కూడా వ్యాపించాయి. కాలిన గాయాలతో సెంథిల్ ఆ సాయంత్రానికే మరణించగా యువతి ఈ రోజు (బుధవారం) ఉదయం 75శాతం గాయాలతో ప్రాణాలు విడిచింది.
సెంథిల్ తమ కూతురిని వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంవత్సరం క్రితం సెంథిల్… యువతి తల్లిదండ్రుల మీద…వారు తన కుడికాలు, చేయి నరికేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేయగా అతను మద్యం తాగి రైలు పట్టాల మీద పడిపోగా… కాలు చేయి పోయాయని తేలింది. తాము ఎంతగా మొత్తుకున్నా పోలీసులు అతనిమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. సెంథిల్ పై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని, అతనిపై చర్యలు తీసుకోలేమని పోలీసులు చెప్పారని వారు అన్నారు. కాలు చేయి పోయినా ఆ దుర్మార్గుడు ఇంతపని చేశాడని వారు వాపోయారు