"నీవు బయటకు వెళ్లవయ్యా..."
ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరితో రక్తం మరుగుతోందని చంద్రబాబు మీడియా ముందు చెప్పారు. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీ కేంద్రమంత్రులు,ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారని ఆయన అనుకూల మీడియా కోతలు కోసింది. అయితే మంగళవారం లోక్‌సభలో జరిగిన సంఘటనతో టీడీపీ నాటకం మరోసారి బట్టబయలైంది. కేంద్రమంత్రులు వంతుల వారీగా లోక్‌సభ, రాజ్యసభలో వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం సుజనా చౌదరికి లోక్‌సభలో పని పడి వచ్చారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలంతా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తన […]

ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరితో రక్తం మరుగుతోందని చంద్రబాబు మీడియా ముందు చెప్పారు. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీ కేంద్రమంత్రులు,ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారని ఆయన అనుకూల మీడియా కోతలు కోసింది. అయితే మంగళవారం లోక్‌సభలో జరిగిన సంఘటనతో టీడీపీ నాటకం మరోసారి బట్టబయలైంది. కేంద్రమంత్రులు వంతుల వారీగా లోక్‌సభ, రాజ్యసభలో వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం సుజనా చౌదరికి లోక్‌సభలో పని పడి వచ్చారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలంతా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తన స్థానాల్లోనే నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
ఇంతలోనే సుజనా చౌదరి వచ్చి అక్కడ కూర్చుకున్నారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ సభ్యులు సుజనా చౌదరి తీరుపై కన్నేశారు. పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే పార్టీ మంత్రి మాత్రం దర్జాగా కూర్చుని ఉండడంపై సభలో గుసగుసలాడుకున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలు అప్రమత్తమయ్యారు. పార్టీ ద్వంద్వ వైఖరికి బయటపడుతుందన్న ఉద్దేశంతో వెంటనే సుజనా చౌదరికి సలహా ఇచ్చారు ఎంపీలు. అవంతి శ్రీనివాస్, తోట నరసింహులు వెళ్లి ”నీవు బయటకు వెళ్లవయ్యా” అంటూ సుజనాకు సూచించారు. దీంతో తేరుకున్న సుజనా చౌదరి వెంటనే సభనుంచి బయటకు వెళ్లిపోయారు.
ఎప్పటిలాగే టీడీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. సభ నుంచి బయటకువెళ్లిపోవాల్సిందిగా కేంద్రమంత్రి సుజనా చౌదరికి టీడీపీ ఎంపీలు సూచించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ప్రచురించడం విశేషం. ”మీరు ఆదేశించండి సర్ .. ప్రత్యేక హోదా కోసం ఇప్పుడే రాజీనామా చేసేస్తాం” అని తాము అన్నట్టు చెప్పుకున్న నేతలు చివరకు ఎంపీలు చెవిలో ఊదడమే ఆలస్యం ప్రత్యేక హోదా డిమాండ్‌ను గాలికి వదిలేసి సభను వదిలివెళ్లిపోవడం ఆసక్తికరమే.
Also Read:
సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి
అది అంత తేలికైన విషయం కాదు..అలియభట్..!
నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న సమంత..!
సెక్స్ అడిక్ట్‌గా అవసరాల శ్రీనివాస్…
వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…
నా చావు నేను చస్తా అంటున్న రాజమౌళి!
Click on Image to Read: