జీఎస్‌టీతో రాష్ట్రాలు నష్టపోతాయి: సీతారాం ఏచూరి
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల రాష్ట్రాలు హక్కులు కోల్పోతాయని సీపీఐ(ఎం) నేత, ఎంపీ సీతారాం ఏచూరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో జీఎస్‌టీపై జరిగిన చర్చలో ఆయన పాల్లొన్నారు. జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలు అనేక వనరులు కోల్పోతాయని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలు కేంద్రంపై ఆధారా పడాలా? అని కూడా ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఈ విషయంలో రాష్ట్రాలకు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా […]
BY sarvi3 Aug 2016 9:32 AM IST
X
sarvi Updated On: 3 Aug 2016 1:40 PM IST
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల రాష్ట్రాలు హక్కులు కోల్పోతాయని సీపీఐ(ఎం) నేత, ఎంపీ సీతారాం ఏచూరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో జీఎస్‌టీపై జరిగిన చర్చలో ఆయన పాల్లొన్నారు. జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలు అనేక వనరులు కోల్పోతాయని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలు కేంద్రంపై ఆధారా పడాలా? అని కూడా ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఈ విషయంలో రాష్ట్రాలకు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జీఎస్‌టీ సవరణ బిల్లును తాము స్వాగతిస్తున్నట్టు మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తెలిపారు. ఈ బిల్లును తాము వ్యతిరేకించడం లేదన్నారు. 2006లోనే తాము ఈ బిల్లును తయారు చేశామని, ఆనాడున్న ప్రతిపక్షం తమకు సహకరించలేదని చెప్పారు. ఈ సందర్భంగా జీఎస్‌టీ బిల్లు రూపకల్పనపై ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వివాదల పరిష్కారానికి అవకాశం కల్పించాలని, పరోక్ష పన్ను రేట్లు తక్కువగా ఉండాలని కోరారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందాలని, జీఎస్‌టీని మనీ బిల్లుగా కాకుండా, పైనాన్స్ బిల్లుగా తీసుకు రావాలని చిదంబరం ప్రతిపాదించారు.
Next Story