చేసిన ఆగం చాలు.. మా ఊరికి రాకండి!
నిన్నమొన్నటి దాకా తెలంగాణలో బర్నింగ్ ఇష్యూగా నిలిచిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఆందోళన సద్దుమణిగింది. 2013 భూ సేకరణ చట్టం అమలు కోసం పోరాడాలని భావించిన టీడీపీ – సీపీఎం, కాంగ్రెస్‌లకు ఎర్రవల్లి ప్రజలు షాక్ ఇచ్చారు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టేందుకే వస్తున్నారు. ఇంతకాలం చేసిన ఆగం చాలు.. మా ఊరికి వస్తే ఊరుకునేది లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామపెద్దలంతా కలిసి తీర్మానం చేశారు. ఊరి పొలిమేరలో ‘ప్రతిపక్షాలు మీరు మా ఊరు […]
BY sarvi3 Aug 2016 4:41 AM IST
X
sarvi Updated On: 3 Aug 2016 5:27 AM IST
నిన్నమొన్నటి దాకా తెలంగాణలో బర్నింగ్ ఇష్యూగా నిలిచిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఆందోళన సద్దుమణిగింది. 2013 భూ సేకరణ చట్టం అమలు కోసం పోరాడాలని భావించిన టీడీపీ – సీపీఎం, కాంగ్రెస్‌లకు ఎర్రవల్లి ప్రజలు షాక్ ఇచ్చారు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టేందుకే వస్తున్నారు. ఇంతకాలం చేసిన ఆగం చాలు.. మా ఊరికి వస్తే ఊరుకునేది లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామపెద్దలంతా కలిసి తీర్మానం చేశారు. ఊరి పొలిమేరలో ‘ప్రతిపక్షాలు మీరు మా ఊరు రావద్దు’ అన్న హెచ్చరిక బోర్డులు కూడా తగిలించారు. ఈ పరిణామంతో ప్రతిపక్షాల గొంతులో పచ్చివెలక్కాయ పడినంత పనైంది. గత ఆదివారం ఎర్రవల్లి గ్రామస్థులపై జరిగిన లాఠీఛార్జితో ప్రతిపక్షాలకు కాస్త మైలేజీ వచ్చినట్లే కనిపించింది. వారం తిరక్కముందే భూనిర్వాసితులు ప్రభుత్వ ప్యాకేజీకి మొగ్గుచూపడంతో ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మల్లన్నసాగర్ పరిధిలో ముంపునకు గురవుతున్న ఎర్రవల్లి , పెన్‌పహాడ్ గ్రామస్థుల ప్రజలు గత ఆదివారం రాజీవ్ రహదారి దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో స్థానిక టీడీపీ నేత వంటేరు ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు కీలకపాత్ర పోషించారు. పోలీసులపై రాళ్లు రువ్వి రైతులపై లాఠీఛార్జిలకు వీరే కారణమయ్యారని మంత్రి హరీశ్ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే! దీనికితోడు సీపీఎం కార్యకర్తలు కూడా గ్రామస్థులకు మద్దతుగా పలు ఆందోళనలు చేస్తున్నారు. ఒక్కసారి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత.. ఎలాంటి పోరాటాలు చేసినా.. లాభం ఉండదని తెలుసుకున్న గ్రామస్థులు జీవో 123 కింద పరిహారం తీసుకునేందుకు అంగీకరించారు. ఈ విషయంలో ఏపీలో అన్యాయంగా భూములు లాక్కున్నపుడు నోరుమెదపని టీడీపీ- సీపీఎం పార్టీలు.. తెలంగాణలో మాత్రం ఉద్యమాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ద్వంద ప్రమాణాలు పాటిస్తోన్న ఈ రెండుపార్టీల నాయకుల విధానాలను హరీశ్ గ్రామస్థులకు వివరించారు. దీంతో దిగివచ్చిన గ్రామస్థులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అందుకే, తమ గ్రామంలోకి ఏ ప్రతిపక్షాన్ని రానీవ్వకూడదని తీర్మానించారు. ఆ మేరకు బోర్డు కూడా తగిలించారు.
Next Story