బాలకృష్ణ కోసం పనిచేస్తున్న ప్రియదర్శిని రామ్!
సాక్షి మీడియా ఫిచర్స్ ఎడిటర్ ప్రియదర్శని రామ్ చాలా మందికి పరిచయమే. ఈయనకు చిత్రరంగంతోనూ అనుబంధం ఉంది. 2006లో ”మనోడు” పేరుతో హీరోగా స్వీయదర్శకత్వంలో సినిమా కూడా తీశారు. ఈ మధ్య ”జ్యోతిలక్ష్మి”, ”బెంగాల్‌టైగర్”లోనూ నటించారు. ఇప్పుడు రామ్ మరో పెద్ద పనిలోనే ఉన్నట్టు ప్రముఖ మీడియా సంస్థ కథనం. వైఎస్ ఫ్యామిలీకి వీరాభిమాని అయిన రామ్… చంద్రబాబు బామ్మర్ధి బాలకృష్ణతో కలిసి ఒక సినిమాకు పనిచేయబోతున్నారట. శాతకర్ణి తర్వాత 101 చిత్రంగా ”రైతు” పేరుతో సినిమా […]
సాక్షి మీడియా ఫిచర్స్ ఎడిటర్ ప్రియదర్శని రామ్ చాలా మందికి పరిచయమే. ఈయనకు చిత్రరంగంతోనూ అనుబంధం ఉంది. 2006లో ”మనోడు” పేరుతో హీరోగా స్వీయదర్శకత్వంలో సినిమా కూడా తీశారు. ఈ మధ్య ”జ్యోతిలక్ష్మి”, ”బెంగాల్‌టైగర్”లోనూ నటించారు. ఇప్పుడు రామ్ మరో పెద్ద పనిలోనే ఉన్నట్టు ప్రముఖ మీడియా సంస్థ కథనం. వైఎస్ ఫ్యామిలీకి వీరాభిమాని అయిన రామ్… చంద్రబాబు బామ్మర్ధి బాలకృష్ణతో కలిసి ఒక సినిమాకు పనిచేయబోతున్నారట. శాతకర్ణి తర్వాత 101 చిత్రంగా ”రైతు” పేరుతో సినిమా తెరకెక్కుతుందని బాలకృష్ణ ఇది వరకే ప్రకటించారు. ఈ ”రైతు” చిత్రానికి ప్రియదర్శిని రామ్ కథ అందిస్తున్నారట. రామ్ కథను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తారని చెబుతున్నారు. పత్రిక కథనమే నిజమైతే ఇది ఆసక్తిరమైన అంశమే. సినిమాలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్న నేటి తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్టకు వైఎస్ కుటుంబ అభిమాని ప్రియదర్శిని రామ్ ఏ తరహాలో కథ రచిస్తారో చూడాలి.
Also Read:
సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి
అది అంత తేలికైన విషయం కాదు..అలియభట్..!
నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న సమంత..!
సెక్స్ అడిక్ట్‌గా అవసరాల శ్రీనివాస్…
వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…
నా చావు నేను చస్తా అంటున్న రాజమౌళి!
Click on Image to Read: