Telugu Global
NEWS

ఇక మహాత్మాగాంధీ స్థానంలో ఎన్టీఆర్‌

టీడీపీ బరితెగింపుకు హద్దులు లేకుండా పోయాయి. వాళ్లు ఏమిచేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరని వాళ్లకు నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే అన్ని వ్యవస్థలను, అన్ని చట్టాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా ఆవిధంగా ముందుకు పోతున్నారు. రోడ్లు ఉండేది జనం నడవడానికే తప్ప విగ్రహాలకోసం కాదని, విగ్రహాలు పెట్టుకోదలిస్తే ఇళ్ళల్లో పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్‌కు మకుటంలేని మహారాజా వారు శ్రీమాన్‌ చంద్రబాబునాయుడు గారు సెలవిచ్చి రెండురోజులు కాకముందే టీడీపీనాయకులు రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్‌నే తమ సంస్థానంగా భావించి ఇతరుల విగ్రహాలను కూల్చి, […]

ఇక మహాత్మాగాంధీ స్థానంలో ఎన్టీఆర్‌
X

టీడీపీ బరితెగింపుకు హద్దులు లేకుండా పోయాయి. వాళ్లు ఏమిచేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరని వాళ్లకు నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే అన్ని వ్యవస్థలను, అన్ని చట్టాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా ఆవిధంగా ముందుకు పోతున్నారు.

gandhi photo1రోడ్లు ఉండేది జనం నడవడానికే తప్ప విగ్రహాలకోసం కాదని, విగ్రహాలు పెట్టుకోదలిస్తే ఇళ్ళల్లో పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్‌కు మకుటంలేని మహారాజా వారు శ్రీమాన్‌ చంద్రబాబునాయుడు గారు సెలవిచ్చి రెండురోజులు కాకముందే టీడీపీనాయకులు రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్‌నే తమ సంస్థానంగా భావించి ఇతరుల విగ్రహాలను కూల్చి, తమ జాతిపిత విగ్రహాలను ప్రతిష్టించే పనిలోపడ్డారు.
మండల కేంద్రమైన అమరావతి డౌన్‌ సెంటర్‌లో జులై 14 రాత్రి భారత జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని తొలగించారు. ఆస్థానంలో ఆగష్టు 1వ తేదీన ఎన్టీరామారావు విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ntr photo 1గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను తొలగించినచోట టీడీపీ వాళ్లు దిమ్మె కడుతుంటే ప్రతిపక్షాలు అధికారులకు ఫిర్యాదు చేశాయి. పాపం అధికారులు ఏం చేయలేకపోయారు. పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా పాలిస్తున్నచంద్రబాబు గారి పాలనలో అధికారులు కూడా పచ్చ చొక్కాలు దరించకపోతే మనుగడ సాగించలేని విధంగా తాయారయింది పరిస్థితి.

ఇప్పుడు విజయవాడలో కూడా వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించినచోట త్వరలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆనందంగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు.

Also Read:

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

అది అంత తేలికైన విషయం కాదు..అలియ‌భ‌ట్‌..!

నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న స‌మంత‌..!

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

manchu manoj

balakrishna priyadarshini ram

jc diwakar reddy

ys jagan

venkaiah naidu1

minister-son

comedian sudhakar

ysrcp

ysrcp flag

tamilnadu mp's

sujana chowdary ashok gajapati raju

anna rambabu, mla ashok reddy

chandrababu modi

jakkanna movie review

First Published:  2 Aug 2016 8:06 AM IST
Next Story