టీడీపీలో రమణకు పొగబెడుతున్నారా?
తెలంగాణలో తెలుగుదేశానికి వీరవిధేయుడిగా పేరొందిన బీసీ నేత ఎల్.రమణకు పార్టీలో పొగబెట్టే ప్రయత్నం మొదలైందా? ఆయనను స్వయంగా తప్పుకునేలా ఓ వర్గం ఆయనకు పొగబెడుతోందా? అస్సలు ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయ అస్ర్త సన్యాసం విషయంపై చర్చ వారి పన్నాగంలో భాగమేనా? రమణపై జరుగుతున్న ప్రచారాన్ని గమనిస్తే.. ఇవన్నీ నిజమేనని వాదిస్తున్నారు ఆయన అనుచరులు. రమణను పార్టీ నుంచి తప్పించడమో.. లేక పార్టీ పగ్గాల నుంచి తప్పించడమో చేసి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలన్న ప్రయత్నాలు కొంతకాలంగా […]
BY sarvi2 Aug 2016 1:58 AM IST
X
sarvi Updated On: 2 Aug 2016 9:55 AM IST
తెలంగాణలో తెలుగుదేశానికి వీరవిధేయుడిగా పేరొందిన బీసీ నేత ఎల్.రమణకు పార్టీలో పొగబెట్టే ప్రయత్నం మొదలైందా? ఆయనను స్వయంగా తప్పుకునేలా ఓ వర్గం ఆయనకు పొగబెడుతోందా? అస్సలు ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయ అస్ర్త సన్యాసం విషయంపై చర్చ వారి పన్నాగంలో భాగమేనా? రమణపై జరుగుతున్న ప్రచారాన్ని గమనిస్తే.. ఇవన్నీ నిజమేనని వాదిస్తున్నారు ఆయన అనుచరులు. రమణను పార్టీ నుంచి తప్పించడమో.. లేక పార్టీ పగ్గాల నుంచి తప్పించడమో చేసి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలన్న ప్రయత్నాలు కొంతకాలంగా ముమ్మరంగా సాగుతున్నాయి.
తెలంగాణలో టీడీపీ నుంచి 15 ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 12 మంది పార్టీ మారారు. శాసనసభాపక్షం టీఆర్ ఎస్‌లో విలీనమైన తరువాత… పార్టీ కూడా విలీనం అవుతుందన్న ప్రచారం జరిగింది. తెలంగాణలోని అన్ని జిల్లాల టీడీపీ అధ్యక్షులు అంతా కలిసి పార్టీని విలీనం చేస్తున్నామని ఈసీకి లేఖ ఇస్తారన్న ప్రచారం పార్టీని కుదిపేసింది. మొదట్లో ఇదంతా టీఆర్ ఎస్ ప్రచారంగా భావించారు రమణ అనుచరులు. ఇప్పుడిప్పుడే ఇదంతా రేవంత్ రెడ్డి వర్గం కుట్రగా అనుమానిస్తున్నారు. మల్లన్నసాగర్ విషయంలో పార్టీ పిలుపును కాదని సొంత ఎజెండాతో ముందుకు పోవడంపై రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం రేవంత్ చేపట్టిన దీక్ష స్థలిలో వెలిసిన పోస్టర్లలోనూ ఎక్కడా రమణ ఫొటో లేకపోవడం ఆయన అసహనాన్ని మరింత పెంచింది. రమణ ఆగ్రహించాడని తెలిసినా.. రేవంత్ లైట్ తీసుకున్నాడు. అధిష్టానం వద్ద రేవంత్ పై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో మరింత నొచ్చుకున్నాడు రమణ. కొంతకాలంగా రమణ టీఆర్ ఎస్‌లో చేరుతున్నాడని… ఆయన రాజకీయ అస్ర్తసన్యాసం చేయబోతున్నాడని మరోసారి ప్రచారం లేవదీసింది రేవంత్ రెడ్డి వర్గమేనని రమణ వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ఒంటెత్తు పోకడలపై ఫిర్యాదు చేశాడన్న అక్కసుతోనే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. మొత్తానికి రమణ స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇప్పటికిప్పుడు కలిసి వచ్చేది ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే! అందుకే, రమణపై జరుగుతున్న దుష్ప్రచారమంతా రేవంత్ వర్గీయుల పనేనని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు.
Next Story