మంచుబిందువులు అక్షింతలుగా...లోయలో వేలాడుతూ వివాహం!
ఆ జంట విచిత్రంగా వివాహం చేసుకుంది. పెళ్లి జరిపించే పురోహితుడితో పాటు అమ్మాయి అబ్బాయి కూడా గాల్లో తాళ్లతో ఊగుతుండగా వారి వివాహం జరిగింది. మహారాష్ట్ర కొల్హాపూర్‌కి చెందిన జయదీప్ జాదవ్ (33) ప్రకృతి ప్రియుడు. అతని వివాహం రేష్మాపాటిల్‌తో నిశ్చయమైంది. అయితే జయదీప్ అందరిలా పెళ్లికోసం ఏ కల్యాణ మండపమో బుక్ చేసుకోలేదు. 350 అడుగుల లోతు వరకు జఖానీ లోయలోకి వెళ్లేలా ఒక రోప్‌వేని ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత వరుడు వధువు ఇద్దరూ పెళ్లి […]
ఆ జంట విచిత్రంగా వివాహం చేసుకుంది. పెళ్లి జరిపించే పురోహితుడితో పాటు అమ్మాయి అబ్బాయి కూడా గాల్లో తాళ్లతో ఊగుతుండగా వారి వివాహం జరిగింది. మహారాష్ట్ర కొల్హాపూర్‌కి చెందిన జయదీప్ జాదవ్ (33) ప్రకృతి ప్రియుడు. అతని వివాహం రేష్మాపాటిల్‌తో నిశ్చయమైంది. అయితే జయదీప్ అందరిలా పెళ్లికోసం ఏ కల్యాణ మండపమో బుక్ చేసుకోలేదు. 350 అడుగుల లోతు వరకు జఖానీ లోయలోకి వెళ్లేలా ఒక రోప్‌వేని ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత వరుడు వధువు ఇద్దరూ పెళ్లి దుస్తులు ధరించారు. పురోహితుడితో పాటు తాళ్ల ద్వారా జఖానీ లోయలోకి దిగిపోయి… ఆయన మంత్రాలు చదువుతుండగా 250 అడుగుల లోతులో జయదీప్, రేష్మ వివాహం చేసుకున్నారు.
జయదీప్ కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులు ఈ ఐడియా చెప్పినపుడు తనకు వెంటనే నచ్చేసిందని అతను అన్నాడు. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ఇందుకు అంగీకరించడంతో ఇది సాధ్యమైనట్టుగా చెప్పాడు. పెళ్లికూతురు తన అనుభవాన్ని వివరిస్తూ తాళ్ల ద్వారా లోయలోకి జారుతున్నపుడు చాలా భయమేసిందని, అయితే అక్కడ వ్యాపించిఉన్న పొగమంచు… నీటి తుంపరుల మధ్య అలా వివాహం చేసుకోవటం ఎంతో ఆనందాన్నికలిగించిందని ఆమె చెప్పింది. ఆదివారం వీరి వివాహం జరిగింది. బంధువులతో పాటు అక్కడ ఉన్న సందర్శకులు సైతం ఈ వివాహ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూశారు.
Click on Image to Read: