కాంగ్రెస్ రైతు ధర్నాహుళక్కే!
ఏ ముహూర్తాన కాంగ్రెస్‌పార్టీ రైతు గర్జన తలపెట్టిందో ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. తెలంగాణలో రైతుల సమస్యలు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వ తీరుపై సమరశంఖం పూరించాడు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కరువు, సాగునీరు తదితర రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేశాడు. సీనియర్లంతా కలిసి జనసమీకరణ, సభ ఏర్పాట్లు కూడా పరిశీలించారు. ఈలోగా మల్లన్నసాగర్ భూసేకరణ అంశం తెరపైకి […]
BY sarvi2 Aug 2016 6:05 AM IST
X
sarvi Updated On: 2 Aug 2016 9:03 AM IST
ఏ ముహూర్తాన కాంగ్రెస్‌పార్టీ రైతు గర్జన తలపెట్టిందో ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. తెలంగాణలో రైతుల సమస్యలు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వ తీరుపై సమరశంఖం పూరించాడు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కరువు, సాగునీరు తదితర రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేశాడు. సీనియర్లంతా కలిసి జనసమీకరణ, సభ ఏర్పాట్లు కూడా పరిశీలించారు. ఈలోగా మల్లన్నసాగర్ భూసేకరణ అంశం తెరపైకి రావడంతో రైతు గర్జనను పక్కన బెట్టారు. ఈలోపు వర్షాలు దంచికొట్టాయి. ప్రాజెక్టులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. అయినా సరే.. రైతు గర్జన నిర్వహించేందుకే ఉత్తమ్ మొగ్గు చూపాడు. ఈసారి పూర్వపు సమస్యలతోపాటు అదనంగా భూ నిర్వాసితులకు 2014 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో రైతు గర్జన నిర్వహించాలని అనుకున్నాడు. కానీ, రెండోసారీ కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైంది. ఈసారి ఆయనకు డెంగీ జ్వరం రావడంతో రైతుగర్జన సభ మరోసారి వాయిదా పడింది.
ఇప్పటికే రెండు,మూడుసార్లు వాయిదా పడ్డ రైతు గర్జన అసలు జరుగుతుందా? లేదా అన్న అనుమానం కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తుతోంది. సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతులు కూడా తీసుకున్న కాంగ్రెస్ నేతలు రైతు గర్జన జరుగుతుందా? లేదా అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాస్తవానికి అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఒక్కటి చేయడానికి అధిష్టానం ఆదేశాల మేరకు రైతు గర్జనకు ప్లాన్ చేశాడు ఉత్తమ్. కానీ, కర్ణుడి చావుకు కారణాలు వంద అన్నట్లుగా తయారైంది రైతు గర్జన సభ పరిస్థితి. ఏదో ఒక కారణంతో సభ వాయిదా పడుతూ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోతున్నారు.
Next Story