Telugu Global
NEWS

మరిగిన రక్తం చల్లబడింది, ఢిల్లీకి చంద్రబాబు

ప్రత్యేక హోదా సాధ్యం కాదని అరుణ్ జైట్లీ ప్రకటించడంతో ”నా రక్తం మరుగుతోంది. నేను ఢిల్లీ వెళ్లను,మోదీని కలవను. అక్కడ నాకేం పని ఉంది?” అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెండు రోజులక్రితం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అయితే ఇంతలోనే బాబు రక్తం చల్లబడినట్టుగా ఉంది. మరో రెండు రోజుల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెల్లడించింది.  అయితే కృష్ణ పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిలను ఆహ్వానించేందుకే చంద్రబాబు వెళ్తున్నారని, ఆసమయంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని […]

మరిగిన రక్తం చల్లబడింది, ఢిల్లీకి చంద్రబాబు
X

ప్రత్యేక హోదా సాధ్యం కాదని అరుణ్ జైట్లీ ప్రకటించడంతో ”నా రక్తం మరుగుతోంది. నేను ఢిల్లీ వెళ్లను,మోదీని కలవను. అక్కడ నాకేం పని ఉంది?” అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెండు రోజులక్రితం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అయితే ఇంతలోనే బాబు రక్తం చల్లబడినట్టుగా ఉంది. మరో రెండు రోజుల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెల్లడించింది. అయితే కృష్ణ పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిలను ఆహ్వానించేందుకే చంద్రబాబు వెళ్తున్నారని, ఆసమయంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రధాని వద్ద చంద్రబాబు ప్రస్తావిస్తారని సదరు ఛానల్ చెబుతోంది. మొత్తానికి ఢిల్లీ వెళ్లేందుకు, మోదీని కలిసేందుకు పుష్కరాలు అనే మంచి కారణమే చంద్రబాబుకు దొరికింది. పుష్కరాలకు ఆహ్వానించి వస్తారా లేక హోదాపై ఏదైనా హామీ సంపాదిస్తారా? అన్నది చూడాలి.

Click on Image to Read:

ys jagan

manchu manoj

balakrishna priyadarshini ram

ntr statue

jc diwakar reddy

venkaiah naidu1

minister-son

comedian sudhakar

ysrcp

ysrcp flag

tamilnadu mp's

sujana chowdary ashok gajapati raju

anna rambabu, mla ashok reddy

chandrababu modi

jakkanna movie review

First Published:  2 Aug 2016 2:41 PM IST
Next Story