సల్మాన్ పెళ్లి నవంబరు 18న
దశాబ్దాల కాలంగా బాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా సల్మాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అంశం అతని పెళ్లి. ఆ తంతు ఎప్పుడు జరగనుందో ఇప్పుడు లోకమంతా తెలిసిపోయింది. ఈ విషయాన్ని మీడియాతో సల్మాన్ చెల్లి అర్పితాఖాన్ వెల్లడించింది. నవంబరు 18న మా అన్న సల్మాన్‌ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని వెల్లడించింది. అయితే, ఈ ఏడాది నవంబరు 18నేనా అంటే మాత్రం చెప్పలేదు. మా అన్న పెళ్లి నవంబరు 18న జరగడం ఖాయం అయితే.. ఏ నవంబరు 18 […]
BY sarvi2 Aug 2016 9:02 AM IST
X
sarvi Updated On: 2 Aug 2016 9:10 AM IST
దశాబ్దాల కాలంగా బాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా సల్మాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అంశం అతని పెళ్లి. ఆ తంతు ఎప్పుడు జరగనుందో ఇప్పుడు లోకమంతా తెలిసిపోయింది. ఈ విషయాన్ని మీడియాతో సల్మాన్ చెల్లి అర్పితాఖాన్ వెల్లడించింది. నవంబరు 18న మా అన్న సల్మాన్‌ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని వెల్లడించింది. అయితే, ఈ ఏడాది నవంబరు 18నేనా అంటే మాత్రం చెప్పలేదు. మా అన్న పెళ్లి నవంబరు 18న జరగడం ఖాయం అయితే.. ఏ నవంబరు 18 అన్నది మీరు మా అన్ననే అడిగి తెలుసుకోండి అని మెలిక పెట్టింది. అదేంటి నంబరు 18 అని తేదీ వెల్లడించి.. సంవత్సరం వద్ద మెలిక పెడితే.. ఎలా ? అంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. సుల్తాన్ భారీ విజయంతోపాటు కృష్ణ జింకలను వేటాడిన కేసులో విముక్తి లభించడంతో సల్మాన్‌ఖాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. భజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ సినిమాలు చేసిన కబీర్‌ఖాన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. నవంబరు 18న పెళ్లి చేసుకుంటానన్న విషయాన్ని ఇటీవల సల్మాన్ కూడా చెప్పాడు. కానీ ఆ విషయంలో స్పష్టతమాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తేదీని అర్పితాఖాన్ మరోసారి ప్రకటించేసరికి ఆయన పెళ్లి వార్తలపై మరోసారి గుసగుసలు మొదలైయ్యాయి. తన చెల్లి వెల్లడించిన విషయాలపై సల్లూ ఏమంటాడో చూడాలి!
Next Story