లోక్సభలో బిక్కుబిక్కుమంటూ టీడీపీ పోరాటం
ప్రత్యేకహోదాపై లోక్సభ స్తంభించింది. సభలో వైసీపీ, టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. అయితే ఇక్కడ కూడా టీడీపీ సభ్యులు బిక్కుబిక్కుమంటూనే నిరసన తెలిపారు. వైసీపీ ఎంపీలు నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో బైఠాయించగా…. టీడీపీ సభ్యులు మాత్రం మోదీకి కోపం రాకుండా తమ స్థానాల వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు తాడోపేడో తేల్చుకోవాల్సిందిగా చెప్పారని… లోక్సభలో ఇక తమ ప్రతాపం చూపిస్తామంటూ బయలుదేరిన ఎంపీలు తీరా సభలో […]
ప్రత్యేకహోదాపై లోక్సభ స్తంభించింది. సభలో వైసీపీ, టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. అయితే ఇక్కడ కూడా టీడీపీ సభ్యులు బిక్కుబిక్కుమంటూనే నిరసన తెలిపారు. వైసీపీ ఎంపీలు నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో బైఠాయించగా…. టీడీపీ సభ్యులు మాత్రం మోదీకి కోపం రాకుండా తమ స్థానాల వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు తాడోపేడో తేల్చుకోవాల్సిందిగా చెప్పారని… లోక్సభలో ఇక తమ ప్రతాపం చూపిస్తామంటూ బయలుదేరిన ఎంపీలు తీరా సభలో మాత్రం ఎప్పటిలాగే మమ అంటూ నిరసన తెలిపారు.
మరోవైపు.. పార్లమెంట్ వెలుపల మాట్లాడిన టీడీపీ ఎంపీలు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఏపీకి రావాల్సిన నిధులు, అదనపు రాయితీలు, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ దేశంలోని అన్ని పార్టీలు కోరినా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం నోరు మెదపట్లేదంటూ గల్లా జయదేవ్ విమర్శించారు. రెండు సంవత్సరాలు మిత్రపక్షంగా బీజేపీని తాము చక్కగా గౌరవించినా కేంద్రం మాత్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు సహనాన్ని అర్థం చేసుకోవాలని… “అలుగటయే ఎరుగని అజాత శత్రువు చంద్రబాబు.. అలిగితే ఎవరికీ మంచిది కాదు” అని ఎంపీ శివప్రసాద్ సినిమా డైలాగ్ చెప్పారు.
Also Read: సెక్స్ అడిక్ట్గా అవసరాల శ్రీనివాస్…
వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…
నా చావు నేను చస్తా అంటున్న రాజమౌళి!
అమలాపాల్ కాపురంలో చిచ్చుకు అదే కారణమా..!
Click on Image to Read: