ఆ దుండగులను కాల్చి చంపే అనుమతి.....మావాళ్లకు ఇవ్వండి!
ఈ ఆవేశానికి అర్థం ఉంది. తమ కాళ్లు చేతులు కట్టేసి 13 ఏళ్ల చిన్నారిపై, ఆమె తల్లిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై బాధితుల కుటుంబం ఆగ్రహావేశం ఇది. ఉత్తర ప్రదేశ్ బులంద్షార్ ఘటనలో సంఘటన స్థలంలో ఉండి, నిస్సహాయులుగా మిగిలిన బాధిత కుటుంబ సభ్యులు సోమవారం మాట్లాడుతూ, తమవారి చేత నిందితులను కాల్చి చంపనివ్వండి… అంటూ డిమాండ్ చేశారు. 13 ఏళ్ల బాధిత బాలికకు మేనమామ వరుసయ్యే వ్యక్తి స్పందిస్తూ, తమ కుటుంబం ఈ ఘాతుకం […]
ఈ ఆవేశానికి అర్థం ఉంది. తమ కాళ్లు చేతులు కట్టేసి 13 ఏళ్ల చిన్నారిపై, ఆమె తల్లిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై బాధితుల కుటుంబం ఆగ్రహావేశం ఇది. ఉత్తర ప్రదేశ్ బులంద్షార్ ఘటనలో సంఘటన స్థలంలో ఉండి, నిస్సహాయులుగా మిగిలిన బాధిత కుటుంబ సభ్యులు సోమవారం మాట్లాడుతూ, తమవారి చేత నిందితులను కాల్చి చంపనివ్వండి… అంటూ డిమాండ్ చేశారు. 13 ఏళ్ల బాధిత బాలికకు మేనమామ వరుసయ్యే వ్యక్తి స్పందిస్తూ, తమ కుటుంబం ఈ ఘాతుకం చేసిన గాయాలనుండి ఎప్పటికీ బయటకు రాలేదని, అయితే మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ఢిల్లీ, ఖాన్పూర్ హైవే మీద వెళుతున్న కారుని అడ్డగించి, దోపిడీ చేయటంతో పాటు అందులో ఉన్న ఒక మహిళ, బాలికమీద మూడుగంటలపాటు దుండగులు అఘాయిత్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తమ ఆడవారిని, కొట్టి హింసించి అత్యాచారం చేస్తుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉండటంలోని బాధ అనుభవించినవారికే తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ఆ దుండగులను… తమ మహిళలు కాల్చి చంపే అనుమతి ఇవ్వాలన్నారు.
మానవహక్కులకు భంగం కలగడమంటే ఇదీ…కానీ కొంతమంది… అత్యాచార నేరస్తులకు ఉరిశిక్ష విధించినపుడు మానవహక్కుల భంగంగా కేకలు పెడతారని ఆయన విమర్శించారు. దుండగుల్లో ఒకడు ఆడవాళ్ల జోలికి వెళ్లవద్దని చెబుతున్నా మిగిలిన వారు వినలేదని ఆయన చెప్పారు. బులంద్షార్ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. యుపి ప్రభుత్వం ఏడుగురు పోలీసులు అధికారులను సస్పెండ్ చేసింది. 300మంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ కేసులో దుండగులకోసం గాలిస్తున్నారు. సోమవారం నిందితులుగా భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
యుపి పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడ బాధిత కుటుంబం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రేప్ జరుగుతున్నపుడు అటుగా పోలీస్ వ్యాన్ వెళ్లినా…ఎలాంటి చెకింగ్లు చేయలేదని వారు అన్నారు. అత్యవసర హెల్ప్‌లైన్ 100కి ఫోన్ చేస్తే… లైన్లు బిజీగా ఉన్నాయని, ఆ తరువాత చాలా సమయం వరకు ఎవరూ ఫోన్‌ని లిఫ్ట్ చేయలేదని చెప్పారు. తరువాత తమ బంధువుకి కాల్ చేయగా, అతనిద్వారా స్పందించిన స్థానిక పోలీసులు…వచ్చి తమని కాపాడే చర్యలు తీసుకోకుండా ప్రశ్నలమీద ప్రశ్నలు వేశారని ఆయన అన్నారు. సీనియర్ అధికారులు మాత్రం తమ బాధని అర్థం చేసుకున్నారని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
బాధిత మహిళ షాక్నుండి కోలుకోలేదని, ఆమె అదే స్థితిలో ఉందని, బాలిక తీవ్రమైన జ్వరంతో బాధపడుతోందని బాలిక అంకుల్ చెప్పారు. తమవారిని బాధించిన ఆ ఏడు, ఏనిమిది మంది దుండగులు అరెస్టు అయ్యే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. బాలిక కొన్ని నెలల వరకు స్కూలుకి వెళ్లే పరిస్థితి లేదన్నారు.
తమని కట్టేసి, కర్రలు, రాడ్లు, సుత్తులతో కొడుతూ దుండగులు, తాము తలలు కూడా ఎత్తకుండా చేశారని, తమ వద్ద ఉన్నవన్నీ తీసుకున్నా… వారిద్దరినీ వదిలేయమని ఎంతగా వేడుకున్నా వదలలేదని, ఆ సంఘటనని గురించి చెప్పలేనని ఆయన ఆవేదన చెందాడు. బాధిత మహిళ, బాలిక… ముగ్గురు దుండగులను గుర్తుపట్టారని ఆయన చెప్పారు.