తెరపైకి కొత్త వెంకన్నసామి..!
వెండితెరపై వెంకటేశ్వర స్వామికి ఓ గుర్తింపు ఉంది. చాలామంది అభిమానుల దృష్టిలో వేంకటేశ్వర స్వామి అంటే ఇప్పటికీ, ఎప్పటికీ నటసార్వభౌముడు నందమూరి తారకరామారావే. ఆ తర్వాత మోడ్రన్ జనరేషన్ కు సుమన్ వేంకటేశ్వర స్వామిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో వెంకన్నస్వామి తెరపైకొచ్చాడు. ఈయన పేరు సౌరభ్. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓం నమో వేంకటేశాయ చిత్రంలో వేంకటేశుని పాత్రకు టీవీ ఆర్టిస్ట్ సౌరభ్ ను ఎఁపిక చేశారు. నిజానికి ఈ సినిమాలో కూడా […]
వెండితెరపై వెంకటేశ్వర స్వామికి ఓ గుర్తింపు ఉంది. చాలామంది అభిమానుల దృష్టిలో వేంకటేశ్వర స్వామి అంటే ఇప్పటికీ, ఎప్పటికీ నటసార్వభౌముడు నందమూరి తారకరామారావే. ఆ తర్వాత మోడ్రన్ జనరేషన్ కు సుమన్ వేంకటేశ్వర స్వామిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో వెంకన్నస్వామి తెరపైకొచ్చాడు. ఈయన పేరు సౌరభ్. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓం నమో వేంకటేశాయ చిత్రంలో వేంకటేశుని పాత్రకు టీవీ ఆర్టిస్ట్ సౌరభ్ ను ఎఁపిక చేశారు. నిజానికి ఈ సినిమాలో కూడా అన్నమయ్యలోని వెంకన్ననే (సుమన్) రిపీట్ చేస్తారని అంతా భావించారు. సుమన్ కూడా తనకే అవకాశం వస్తుందని ఊహించాడు. కానీ రాఘవేంద్రరావు మాత్రం సౌరభ్ వైపు మొగ్గుచూపాడు. సినిమాలో ఏడుకొండలస్వామి భక్తుడు హథీరాంబాబాగా నాగార్జున నటిస్తున్నాడు.
అన్నమయ్య, శ్రీరామదాసు తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున కలయికలో వస్తున్న మరోభక్తికథా చిత్రం ఇది. ఇందులో వెంకటేశ్వర స్వామిగా టీవీ నటుడు సౌరభ్ నటిస్తున్నాడు. అన్నమయ్యలో గోవిందుడుగా… సుమన్ నటించాడు. దేవుడిగా.. సుమనా? అని చాలామంది ఆశ్చర్యం.. అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేసేలా.. సుమన్‌లో దేవుడిని చూపించాడు దర్శకుడు. ఓం నమో వెంకటేశాయలో వెంకటేశ్వరస్వామిగా నటించే నటుడు మారిపోయాడు. దీంతో….ఆపదలమొక్కులవాడుగా.. సౌరభ్ ఎలా వుంటాడా? అన్న ఆసక్తి నెలకుంది. వెంకటేశ్వరస్వామి ఫస్ట్ లుక్‌ను మోషన్ పిక్చర్‌గా రిలీజ్ చేశాడు. సుమన్ కంటే సౌరభ్ కాస్త మొహం చిన్నదిగా వున్నా.. నయా వెంకటేశ్వరుడు బాగానే వున్నాడు.