నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న సమంత..!
అందాల ముద్దుగుమ్మ సమంత… తన గురించి తాను ఎప్పుడు విశ్లేషించుకుంటుంది. ఒకసాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సమంత.. హీరోయిన్ గా ఈ స్థాయికి రావడానికి తన గొప్పతనం ఏమి లేదని తరచు చెబుతుంటుంది. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటిస్తోంది సమంత. ఆమె మాట్లాడుతూ ‘‘ఉదయం లేవగానే.. ‘ఈరోజు నా స్థితికి కారణం ఏమిటి’ అని ఆలోచిస్తా. ‘నాకు దక్కిన అవకాశాలు, అదృష్టం’ అనే సమాధానం మాత్రమే నన్ను సంతృప్తి పరుస్తుంది. […]
BY sarvi1 Aug 2016 2:46 PM IST
X
sarvi Updated On: 1 Aug 2016 2:57 PM IST
అందాల ముద్దుగుమ్మ సమంత… తన గురించి తాను ఎప్పుడు విశ్లేషించుకుంటుంది. ఒకసాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సమంత.. హీరోయిన్ గా ఈ స్థాయికి రావడానికి తన గొప్పతనం ఏమి లేదని తరచు చెబుతుంటుంది.
ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటిస్తోంది సమంత. ఆమె మాట్లాడుతూ ‘‘ఉదయం లేవగానే.. ‘ఈరోజు నా స్థితికి కారణం ఏమిటి’ అని ఆలోచిస్తా. ‘నాకు దక్కిన అవకాశాలు, అదృష్టం’ అనే సమాధానం మాత్రమే నన్ను సంతృప్తి పరుస్తుంది. నేనేం మేధావి కాను. నాకంటే కష్టపడేవాళ్లు, నాకంటే గొప్పోళ్లు చాలామంది ఉన్నారు. అంటే నాకు అర్హతకు మించిన అదృష్టం దొరికిందన్నమాట. అలాంటప్పుడు నేనేదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా? దానికి సమా ధానమే ప్రత్యూష ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న పనులు తనుకు ఎంతో మానసిక ఆనందం ఇస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది.
Next Story