లీకేజీ గురించి మార్చిలోనే హెచ్చరించిన కేసీఆర్
ఉగాది పండుగ రోజు మీడియా సాక్షిగా.. కేసీఆర్ చేసిన హెచ్చరిక నిజమైంది. ఉగాది పర్వదినం రోజు దుర్ముఖినామ సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అందరూ ప్రసంగించాక ఆఖరున కేసీఆర్ ప్రసంగించాడు. అంతా బానే ఉంది. కానీ, ఈ సంవత్సరం కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలకు జాతక పరంగా అంత బాగాలేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి! అంటూ సభాముఖంగా హెచ్చరించాడు. అప్పట్లో ఈవిషయం పత్రికల్లో పతాక శీర్షకన నిలిచింది. సీఎం వారిద్దరినే ఎందుకు హెచ్చరించారు. అప్పటికే […]
BY sarvi1 Aug 2016 4:43 AM IST
X
sarvi Updated On: 1 Aug 2016 6:48 AM IST
ఉగాది పండుగ రోజు మీడియా సాక్షిగా.. కేసీఆర్ చేసిన హెచ్చరిక నిజమైంది. ఉగాది పర్వదినం రోజు దుర్ముఖినామ సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అందరూ ప్రసంగించాక ఆఖరున కేసీఆర్ ప్రసంగించాడు. అంతా బానే ఉంది. కానీ, ఈ సంవత్సరం కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలకు జాతక పరంగా అంత బాగాలేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి! అంటూ సభాముఖంగా హెచ్చరించాడు. అప్పట్లో ఈవిషయం పత్రికల్లో పతాక శీర్షకన నిలిచింది. సీఎం వారిద్దరినే ఎందుకు హెచ్చరించారు. అప్పటికే విద్యాశాఖ మంత్రిగా కడియం, వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి కొనసాగుతున్నారు. మీ శాఖల్లో అవినీతి జరిగే ప్రమాదముందని జ్యోతిష్యం చెబుతోందని సభాముఖంగా అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించారు.
సరిగ్గా నాలుగు నెలల తరువాత సీఎం ప్రసంగం అక్షరాల నిజమైంది. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం ఆ ఇద్దరు మంత్రుల మెడకు చుట్టుకుంది. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ వీరిద్దరూ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీ శాఖలో అవినీతి, అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆనాడే హెచ్చరించగలిగారంటే.. ఆయన కేవలం పంచాంగం మీదే ఆధారపడ్డారా? లేక అప్పుడున్న నిఘా వర్గాల సమాచారానికి పంచాంగం జోడించి చెప్పారా? అన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఉగాది రోజున కేసీఆర్ ఆ మంత్రులిద్దరినీ ఉద్దేశించి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్పింగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదంతా కాకతాళీయంగానే జరిగినా.. కేసీఆర్ అభిమానులు మాత్రం ఆయన మార్చిలోనే హెచ్చరించినా.. వీరిద్దరూ లైట్ తీసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Next Story