వైఎస్ పాలసీల వల్లే అలా!, చిరుతో మంచి అనుబంధం ఉంది
అనారోగ్యం కారణంగా కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటున్న కమెడియన్ సుధాకర్ … తిరిగి వెండితెరపై కనిపించబోతున్నారు. పూరి జగన్నాథ్ సోదరుడు హీరోగా నటిస్తున్న ”వాడు నేను కాదు” చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నట్టు సుధాకర్ చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్లిపోయానని ఒక ఇంటర్వ్యూలో సుధాకర్ చెప్పారు. తాను తాగుబోతును కాదని… తాగుడు వల్లే అనారోగ్యం వచ్చిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇప్పుడు తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని ”వాడు నేను కాదు” చిత్రం తర్వాత మరిన్ని […]
అనారోగ్యం కారణంగా కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటున్న కమెడియన్ సుధాకర్ … తిరిగి వెండితెరపై కనిపించబోతున్నారు. పూరి జగన్నాథ్ సోదరుడు హీరోగా నటిస్తున్న ”వాడు నేను కాదు” చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నట్టు సుధాకర్ చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్లిపోయానని ఒక ఇంటర్వ్యూలో సుధాకర్ చెప్పారు. తాను తాగుబోతును కాదని… తాగుడు వల్లే అనారోగ్యం వచ్చిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇప్పుడు తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని ”వాడు నేను కాదు” చిత్రం తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. చిరంజీవి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు.
చిరు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడాన్నిప్రస్తావించగా…. తనకు రాజకీయాలంటే పడవని సుధాకర్ చెప్పారు. తన తండ్రి తొలి నుంచి కాంగ్రెస్‌వాది అని… వైఎస్ పథకాలని చూసే అప్పట్లో ప్రచారానికి వెళ్లానని చెప్పారు. ఇప్పటి రాజకీయ అంశాలపై అస్సలు ఆసక్తి లేదన్నారు. తాను ఆస్ప్రతిలో ఉన్న సమయంలో చిరంజీవి తన కుటుంబసభ్యులతో వచ్చి పరామర్శించారని గుర్తు చేసుకున్నారు. చిరుతో కలిసి రూమ్మేట్స్గా ఉన్నప్పుటి జ్ఞాపకాలను సుధాకర్ గుర్తు చేసుకున్నారు. తన కుమారుడికి చిరంజీవియే సీటు ఇప్పించారని సుధాకర్ చెప్పారు. ఆర్థికంగానూ తన పరిస్థితి బాగానే ఉందన్నారు. తాను తిరిగి కోలుకోగలిగానంటే అందుకు తన భార్య, కుమారుడు, కుటుంబసభ్యుల కారణమని చెప్పారు. ఆస్పత్రిలో ఉండగా బ్రహ్మానందం, తనికెళ్లభరణితో పాటు చాలా మంది వచ్చి పరామర్శించారన్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని ఉందన్నారు.
Also Read:
నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న సమంత..!
సెక్స్ అడిక్ట్‌గా అవసరాల శ్రీనివాస్…
వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…
నా చావు నేను చస్తా అంటున్న రాజమౌళి!
అమలాపాల్ కాపురంలో చిచ్చుకు అదే కారణమా..!
Click on Image to Read: