వాట్ ఏ.. ముందు చూపు బాస్...
ఎత్తులు మంచివా చెడ్డవా అన్న విషయం పక్కన పెడితే… వాటిని వేయడంతో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. లేటెస్ట్‌గా ప్రత్యేక హోదా విషయంపై ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు…ఏకంగా తాను ఢిల్లీ వెళ్లను, మోదీని కలవను అని ప్రకటించారు. చూసే వారికి అబ్బో చంద్రబాబుకు ఈ రేంజ్లో కోపం వచ్చిందేంటి?. ఈ ఆగ్రహజ్వాలను మోదీ తట్టుకోగలరా అన్న రేంజ్‌లో బాబు గుడ్లు ఉరిమారు. కానీ మోదీని కలవను అని ప్రకటించడం వెనుక సంగతి వేరే ఉందని సమాచారం. త్వరలోనే చంద్రబాబు ఢిల్లీ […]
ఎత్తులు మంచివా చెడ్డవా అన్న విషయం పక్కన పెడితే… వాటిని వేయడంతో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. లేటెస్ట్‌గా ప్రత్యేక హోదా విషయంపై ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు…ఏకంగా తాను ఢిల్లీ వెళ్లను, మోదీని కలవను అని ప్రకటించారు. చూసే వారికి అబ్బో చంద్రబాబుకు ఈ రేంజ్లో కోపం వచ్చిందేంటి?. ఈ ఆగ్రహజ్వాలను మోదీ తట్టుకోగలరా అన్న రేంజ్‌లో బాబు గుడ్లు ఉరిమారు. కానీ మోదీని కలవను అని ప్రకటించడం వెనుక సంగతి వేరే ఉందని సమాచారం.
త్వరలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని కలిసి తాను అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో వివరణ ఇచ్చుకుంటారని చెబుతున్నారు. అయితే తనకు తానే వెళ్లినట్టుగా అనిపించకుండా ఉండేందుకు మోదీని తాను కలవనని చంద్రబాబు ప్రకటించారట. అంటే త్వరలో మోదీని చంద్రబాబు కలవగానే ఎలాగో బాబు మీడియా గొట్టాలు ”దిగివచ్చిన మోదీ”, ”చంద్రబాబు ఆగ్రహంతో ప్రధాని పునరాలోచన”. ”స్వయంగా ఫోన్ చేసి కలవాల్సిందిగా మోదీ వేడుకోలు” వంటి హెడ్‌లైన్లు పెట్టి జనాలను బకరాలను చేసే ప్రయత్నం ఎలాగూ ఉంటుంది. అంటే చంద్రబాబు చీకట్లో అపాయింట్‌మెంట్ తీసుకుని మోదీని కలిసినా… ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మాత్రం మోదీయే దిగివచ్చారన్న భావన కలగాలి. అందుకే తాను మోదీని కలవనని చంద్రబాబు ప్రకటించారంటున్నారు.
భవిష్యత్తులో మోదీని చంద్రబాబు కలిస్తే మాత్రం మోదీయే బతిమలాడుకుని చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తారన్న మాట. చంద్రబాబు కామెడీ కాకుంటే… సొంత మెజారిటీతో కేంద్రాన్ని నడుపుతున్న మోదీని ధిక్కరించి చంద్రబాబు తట్టుకోగలరా?. అందులోనూ ఏపీలో వేల కోట్ల అవినీతి చేస్తూ మోదీని చంద్రబాబు ఎదిరిస్తారా?. అందుకే ”వినేవాళ్లు ఏపీ ప్రజలైతే చెప్పేది చంద్రబాబు మీడియా” అని అనేది.
Click on Image to Read: