గుజరాత్ సీఎం రాజీనామా
గుజరాత్ సీఎం ఆనంది బెన్ రాజీనామాకు సిద్ధపడ్డారు. సీఎం పదవి నుంచి తనకు విముక్తి కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. రెండు నెలల క్రితమే ఈమేరకు పార్టీ హైకమాండ్‌ను కోరిన ఆమె… నేడు ఆ లేఖను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. 2017లో గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు కొత్త సీఎంకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. నవంబర్‌తో ఆనందిబెన్ 75వ ఏట అడుగుపెడుతున్నారు. ఈమె హయాంలోనే […]
గుజరాత్ సీఎం ఆనంది బెన్ రాజీనామాకు సిద్ధపడ్డారు. సీఎం పదవి నుంచి తనకు విముక్తి కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. రెండు నెలల క్రితమే ఈమేరకు పార్టీ హైకమాండ్‌ను కోరిన ఆమె… నేడు ఆ లేఖను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. 2017లో గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు కొత్త సీఎంకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. నవంబర్‌తో ఆనందిబెన్ 75వ ఏట అడుగుపెడుతున్నారు. ఈమె హయాంలోనే పటేళ్ల ఉద్యమం పతాకస్థాయిలో నడిచింది. గుజరాత్ ఉనాలో దళిత యువకులపై దాడి వ్యవహారం కూడా ఆనంది బెన్ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బందిపెట్టింది. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ వచ్చారు.
Click on Image to Read: